మట్టి గాజులే చేతులకు ఎందుకు ధరించాలి?.. రంగు రంగుల గాజుల వెనుక ఉన్న రహస్యం ఏంటి..?
గాజులు ఎందుకు వేసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజుల్లో పాశ్చాత్య పోకడలకు పోయి చాలామంది యువతలు, మహిళలు గాజులు వేసుకోవడమే మానేశారు. కొందరు వేసుకున్నా.. ఏవో ప్లాస్టిక్ గాజులని ధరిస్తున్నారు. సిటీలో ఉండేవారైతే... గాజులు వేసుకుంటే ఎక్కడ పల్లెటూరి అమ్మాయిగా చూస్తారని పూర్తిగా మానేస్తున్నారు. ప్రత్యేకంగా పండగలకు మాత్రం గాజులని వేసుకుంటున్నారు. కానీ.. ప్రతిరోజు చేతికి గాజులు వేసుకోవాలని హిందూ సాంప్రదాయం చెబుతోంది. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. చేతులు నిండా.. అంటే అరడజను గాజులు వేసుకుంటే.. అవి అటు ఇటు కదులుతూ శబ్దం చేస్తుంటాయి. వీటివల్ల శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. మణికట్టు ప్రదేశాన్ని తాకుతుంటాయి కాబట్టి.. రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది.
రక్తనాళాలకు సహజంగానే మసాజ్ చేస్తాయి. అలా సొట్ట ఎక్కువగా ఉండదు. శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మట్టి గాజులు శరీరంలో వేడిని తగ్గిస్తాయట. ఎన్ని బంగారు గాజులున్నా .. కనీసం రెండు మట్టిగాజులైన వేసుకోవాలంటున్నారు అందుకే. హార్మోన్లు అసమధూల్యత రాకుండా ఉంటుంది. నేటితరం అమ్మాయిల్లో హార్మోన్లు సమతుల్యత పెరగడానికి గల కారణాల్లో మట్టి గాజులు వేసుకోకపోవడం కూడా ఒకటి అంటున్నారు నిపుణులు. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. అన్ని జీవక్రియలు ఆరోగ్యంగా సాగుతాయి. ఎరుపు రంగు మట్టి గాజులు వేపుకుంటే శక్తి, బ్లూ కలర్ మట్టి గాజులు విజ్ఞానాన్ని, గ్రీన్ కలర్ మట్టి గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు మట్టి గాజులు సంతోషాన్ని కలిగిస్తాయి. స్త్రీకి గాజులు కేవలం అందం మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వీటిని చాదస్తంగా భావించకుండా.. సాంప్రదాయాన్ని గౌరవించేలా చూడాలి.