చలికాలంలో గీజర్ వాడుతున్నారా?.. అయితే ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదంలో పడినట్లే..!

lakhmi saranya
చలికాలం వచ్చిందంటే చాలు ప్లీజ్ అని మరీ ఎక్కువగా వాడుతారు. చెన్నైలో స్నానం చేయలేని వారు ఈ క్లీజర్ వాటర్ ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అసలే చలికాలం.. క్రమంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. దీంతో చాలామంది ఉదయం పూట వేడినీళ్లతోనే స్నానం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకోసం వాటర్ హీటర్లు, టీజర్లు వాడుతున్నారు. అయితే వీటిని క్రమంగా వాడకపోతే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కొంతమంది వేడి నీటితో స్నానం చేసేందుకుకని ముందుగానే గిజర్ ఆన్ చేసి, స్నానం చేశాక కూడా ఎక్కువ సేపు అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. దీంతో గిజర్ చాలా హీట్ ఎక్కుతుంది. దాన్ని ఎఫెక్ట్ వల్ల గీజర్ కు కనెక్ట్ అయి ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు కూడా వేడెక్కి సమస్యలు తలెత్తవచ్చు. కొన్నిసార్లు గీజర్ పేలిపోవచ్చు. కాబట్టి స్నానం చేయగానే వెంటనే ఆఫ్ చేయాలి. ఏ వస్తువైనా కొంతకాలానికి రిపేర్ కు వస్తుంది. గీజర్ అందుకు అతీతం కాదు. కాబట్టి ఆర్నెల్లకో, ఏడాదికో చెక్ చేస్తూ ఉండాలి. ఏడాదికోసారి సర్వీస్ చేయించాలి.
అలాగే గీజర్ కు కనెక్ట్ చేసి ఉండే వైర్లు పాడైపోతే గనుక వెంటనే మార్చాలి. వాల్వ్స్ లో లీకేజీలు లేకుండా చూసుకోవాలి. అయితే ఇవన్నీ మీరు సొంతంగా చేయటం రిస్క్ తో కూడిన పని, కాబట్టి ఎలక్ట్రిషన్ ద్వారా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత గీజర్ లోని వివిధ పార్ట్స్ పాడైపోయి ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేయించాలి. అలాగే ట్యాంక్ లో నీళ్లు లేనప్పుడు గీజర్ ఆన్ చేస్తే పాడైపోవచ్చు. ఇంట్లో గీజర్ ఆన్ చేసి ఉన్నప్పుడు ఎక్కువ పవర్ తీసుకునే ఇతర పరికరాలను కూడా వాడకూడదు. దీనివల్ల గీజర్ సిస్టమ్ పై ఒత్తిడి పెరిగి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. హింటింగ్ ఎలిమెంట్ అరిగిపోయిన దానిపై మినరల్స్ పేరుకుపోయిన వెంటనే మార్చడం బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: