దీపావళి ముగిసిందా?.. అయితే అందం మరియు ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

lakhmi saranya
ఆడవాళ్లు అందానికి మరి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆడవాళ్ళకి అందమే ఎక్కువ ముఖ్యం. తెలుగు ప్రజలంతా దీపావళి పండుగలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ పండుగ బిజీలో చాలామంది స్కిన్ గురించి పెద్దగా పట్టించుకోరు. బాణాసంచా కాల్చడం వల్ల చర్మం పై స్కిన్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా స్వీట్స్ కూడా తింటారు. వీటితోపాటు ఫ్రైడ్ ఫుడ్స్ తినటం, లైట్ గా పడుకోవడం... ఇలా కొన్ని పనులు చర్మానికి పలు సమస్యలు కొనితెచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
కాగా మీ స్కిన్ పునరుత్తేజం అవ్వడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు... అవేంటో ఇప్పుడు చూద్దాం. దీపావళికి స్కిన్ మొత్తం అధికంగా కాలుష్యాన్ని, దుమ్ము, ధూళిని ఎదుర్కొంటుంది. కాగా పండగ అనంతరం ఫేస్ ను గట్టిగా రుద్దకుండా... మృదువుగా శుభ్రం చేసుకోండి. సునీతమైన ఫేస్ కాబట్టి స్కిన్ ముఖం పై గట్టిగా రుద్దితే దురదలు, చర్మం పొడిగా మారడం లాంటివి జరిగే.. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఫేస్టివల్ కాబట్టి అందరిలో ఆకర్షణీయంగా కనిపించడం కోసం చాలామంది మహిళలు మేకప్ తప్పకుండా వేసుకుంటారు. పైగా సెల్ఫీలు బాగా రావాలని మరింత మేకప్ వేస్తారు. కాగా దీపావళి అయిపోయినాక.. మరుసటి రోజు నుంచి వారం వరకు మేకప్ కు కాస్త బ్రేక్ ఇస్తే మంచిది.
 ఆ వారం రోజులు మాయిశ్చరైజర్లు వాడటం స్కిన్ కు మేలు. చర్మం లోని వ్యార్థాలు బయటకి వెళ్లేందుకు బాడీ హైడ్రేటేడెట్ గా ఉండటం ప్రధానం. కాగా దీపావళి తరువాత టాక్సిన్స్ బయటకి వెళ్లేందుకు, స్కిన్ లో తేమ మెరుగ్గా అయ్యేందుకు నీరు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మనిషికి తప్పకుండా 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. కానీ పండగ సమయంలో ఎక్కువగా పనులు ఉండడం కారణంగానో లేక అతిథులతో టైమ్ స్పెండ్ చేయడం, దీపావళిని ఎంజాయ్ చేయడం వల్ల సరిగ్గా నిద్రపోరు. కాగా పండగ పనులన్నీ పూర్తయ్యాక కొన్ని రోజుల వరకు టైమ్ కి తిని టైమ్ పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: