శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

lakhmi saranya
ఈ దేశంలో ప్రతి భార్యాభర్త శృంగారంలో పాల్గొంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ శృంగారం వల్ల కొంత రిలీఫ్ ని పొందవచ్చు. శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా. సెక్స్ అనేది ఆనందం, సాన్నిహిత్యం మాత్రమే కాదు. కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం నుంచి నిద్రను మెరుగుపరచడం వరకు... వత్తిడి తగ్గించటం నుంచి గుండెను పదిలంగా ఉంచడం వరకు.... ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని కలిగి ఉండటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఒత్తిడికి గురైనప్పుడు... శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది.
ఇది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే ఉద్రిక్తత లాంటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే సెక్స్ ఎండార్ఫిన్ ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు. కాదా మానసిక స్థితిని పెంచుతాయి. అంతేకాదు శృంగారం లవ్ హార్మోన్ అని పిలువబడే ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది రిలాక్స్ గా చేస్తుంది. భాగస్వామితో మరింత కనెక్ట్ అవ్వటానికి సహాయపడుతుంది. ఒత్తిడి స్థాయిలను పూర్తిగా తగ్గిస్తుంది. సెక్స్ సమయంలో శరీరం విడుదల చేసే హార్మోన్ల జాబితాలో పొలాక్టిన్ ఉంటుంది. నిద్ర నియంతరించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
 కాగా సెక్స్ తర్వాత... ప్రోలాక్టిన్ లో పెరుగుదల ఎక్కువగా మగత, రిలాక్స్డ్ అనుభూతికి కారణం అవుతుంది. ఇది మరింత సులభంగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా... లోతైన, ప్రశాంతమైన నిద్రకు మద్దతు ఇస్తుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ HPV తో సహా అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే యాంటీబాడిస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా సెక్స్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి వారం మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు శృంగారం చేసే వ్యక్తులు లాలాజలంలో యాంటీబాడి ఇమ్యునోగ్లోబులిన్ A ని కలిగి ఉంటారు. ఇది వైరస్లు, బ్యాక్టీరియా తో పోరాడే శరీర సామర్థ్యన్ని మెరుగుపరుస్తుంది. ఇక 2021లో జరిపిన ఆధ్యయం సెక్స్ లో పాలుకోవటం కోవిడ్ -19 వైరస్ తో పోరాడే మెరుగైన సామర్ధ్యంతో ముడిపడి ఉందని కనుగొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: