తమకంటే పెద్దవారినీ భర్తగా అమ్మాయిలు కోరుకోవడానికి గల కారణం..?

frame తమకంటే పెద్దవారినీ భర్తగా అమ్మాయిలు కోరుకోవడానికి గల కారణం..?

Divya
సాధారణంగా అమ్మాయిలు ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలనే విషయానికి వస్తే ఎక్కువగా లక్షలలో జీతం, పెద్దపెద్ద ఆస్తిపాస్తులు, భూములు భారీగా ఉండే వారినే వివాహం చేసుకోవాలనుకునేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు లేకపోయినా పరవాలేదు తమని అర్థం చేసుకునేవారు వస్తే చాలని పరిస్థితికి అమ్మాయిలు మారిపోయారు. ఇలాంటి లక్షణాలు వయసు ఎక్కువగా ఉన్న వారిలో ఉన్నప్పటికీ కూడా అమ్మాయిలు వారిని వివాహం చేసుకోవడానికి అభ్యంతరం చెప్పడం లేదట. ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి వాళ్ళని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారట. మరి అమ్మాయిలు ఇష్టపడడానికి గల ముఖ్య కారణం ఏంటో చూద్దాం.

నిజానికి వయసు పైబడిన వ్యక్తి తమ భార్యను కచ్చితంగా బాగా చూసుకుంటాడని నమ్మకం ఇప్పుడు అమ్మాయిలలో ఏర్పడిందట. ఎందుకంటే అప్పటికి తాను ఎంతో జీవితాన్ని అనుభవించి ఉంటాడు.. అవతలి వాళ్ళ వ్యక్తిత్వం అలాగే తమ పిల్లల్ని కూడా అద్భుతంగా పెంచగలరని నమ్మకం ఏర్పడుతూ ఉందట.

మెచ్యూరిటీ ఉన్న సమయంలో చాలా మంది పురుషులలో , యువతీలలో అహంకారంతో ఉంటారు. కానీ వయస్సు  పైబడిన మగవారిలో అలాంటి అహంకారం ఎక్కడా కనిపించదట.

యువతులు ఎక్కువమంది తమకంటే పెద్దవారిని ప్రేమించడానికి మక్కువ చూపుతున్నారనే విషయానికి వస్తే.. వయసు పైబడిన మగవాళ్ళ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా ప్రగల్ బాలు పలకరని అమ్మాయిల నమ్మకం.

అలాగే వయోజన పురుషులు ఆడవాళ్ళని సైతం ఎలా ఆకర్షించాలో బాగా తెలిసిన వారు కూడా ఉంటారట. అందుకే చాలామంది పురుషులు తమ సహచరికి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి మక్కువ చూపుతున్నారట.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వయసు పైబడిన వ్యక్తి తన భార్య ఎలాంటి కోపాన్ని చూపించిన వాటిని అర్థం చేసుకుంటాడు. అలాగే ఎలాంటివి గొడవలకు కూడా కోరని అందుకే అమ్మాయిలు ఎక్కువగా వీరిని ఆకర్షిస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: