ఇలా చేస్తే.. రాత్రిపూట కంటి నిండా నిద్ర పట్టడం కాయం..!

frame ఇలా చేస్తే.. రాత్రిపూట కంటి నిండా నిద్ర పట్టడం కాయం..!

lakhmi saranya
చిన్నపిల్లలు నిద్రపోయినట్లు పెద్దలు ఎక్కువగా నిద్రపోలేరు . వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తక్కువ అయితే ఉంటుంది . కొంతమందికి అయితే అసలు నిద్రే పట్టదు . నిద్ర ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు ఎందరో ఉన్నారు . కానీ నిద్ర లేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది . మారుతున్న జీవనశైలి అండ్ ఒత్తిడితో నిండిన జీవితం వల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు . కొన్నిసార్లు ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది .

ఇటువంటి వారు ఏం చేస్తే బాగా నిద్ర పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం . ఒత్తిడితో నిండిపోయిన జీవితంలో రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడానికి గది ఉష్ణోగ్రతను సెట్ చేయాలి . ఎండాకాలంలో ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతను మీ శరీరం కంటే ఒక డిగ్రీ తక్కువగా ఉంటుంది . ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది . అదే విధంగా మీరు బాగా నిద్రపోవచ్చు కూడా . చాలామంది పొద్దంతా పనిచేసే అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు రాత్రి అని కూడా చూడకుండా స్నానం చేస్తుంటారు . నిజానికి ఇలా రాత్రిపూట స్నానం చేయడం మీకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది .

ఇందుకోసం మీరు చల్లని నీటినే వాడాలి . రాత్రిపూట కూల్ వాటర్ తో స్నానం చేయడం వల్ల అలసట కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది . అదేవిధంగా ఇది మీకు రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది . దీని ద్వారా మీకు నిద్ర కూడా బాగా పడుతుంది . రాత్రిపూట ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కు మల్లడం వల్ల కూడా నిద్ర డిస్టబెన్స్ అవుతుంది . ఎలాంటప్పుడు మీకు నిద్ర రాకపోతే మీరు వాటర్ బ్యాగ్ సహాయం తీసుకోండి . మీరు చేయాల్సినదల్లా మీ కాళ్ళ మధ్య చల్లని నీటితో నిండిన నీటి సంచిని ఉంచండి . ఇలా చేయడం ద్వారా కూడా మీకు మెరుగైన నిద్ర పడుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: