అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం ఇటీవల జూలై 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి దేశ విదేశాల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ప్రముఖులు అందరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వివాహ అనంతరం ఈ జంట హనీమూన్ కి వెళ్లారు.
హనీమూన్ కోసం కోస్టారికా అనే ప్లేస్ కి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఈ జంట ఆగస్టు 1వ తేదీన కోస్టారికా చేరుకున్నారు. అక్కడ కాసాలాస్ ఓలాస్ లో ఉంటున్నట్లు సమాచారం. అయితే వారు ఉంటున్న రిసార్ట్ లో ఒక్కరోజు ఖరీదు ఎంత అనే విషయంపై ఇప్పుడు నెట్టింట్లో ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ రిసార్ట్ లో కేవలం ఒక్క రాత్రికి $30,000 ఖర్చు అవుతుంది. అంటే రూ. 25 లక్షలకు పైగా ఖర్చు అవుతుందట.
కాసాలాస్ ఓలాస్ ప్రీటా బే వీక్షణలతో కూడిన విలాసవంతమైన రిసార్ట్. అంతేకాకుండా ఈ రిసార్ట్ చాలా పెద్దదిగా ఉంటుందట. చూడడానికి ఎంతో లగ్జరియస్ గా ఉండడం వల్ల ఇంత ఖరీదు ఉందట. సుమారు 100 అడుగుల స్విమ్మింగ్ పూల్, ఓపెన్ ఎయిర్ తో సంపన్నులు మాత్రమే ఈ రిసార్ట్ కి వెళ్తారట. సామాన్యులు ఈ రిసార్ట్ కి వెళ్లలేరని.... కోట్లలో డబ్బులను ఖర్చుచేసే వారు మాత్రమే ఈ రిసార్ట్ కి వెళ్ళగలరని సమాచారం అందుతోంది.
ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రిసార్ట్ ఇది కావడం విశేషం. ప్రస్తుతం ఈ రిసార్ట్ కి సంబంధించి సోషల్ మీడియాలో నెటిజెన్లు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా... ముఖేష్ అంబానీ కొడుకు వివాహం... నేపథ్యంలో... జియో ధరలు పెరిగినట్లు మొన్నటి వరకు రచ్చ జరిగింది. తన కొడుకు పెళ్లి ఖర్చుల కోసం వినియోగదారుల చార్జీలను... ముకేశ్ అంబానీ పెంచాడని విమర్శలు చేశారు.