దోమలు కుట్టడానికి కారణం ఏంటో తెలుసా..?
ఆడ దోమ మనిషిని కుట్టిన తర్వాత దోమ లాలాజలాన్ని మానవుని రక్తంలోకి చేరడం వల్ల.. మనుషులకు చికెన్ గున్య, డెంగ్యూ, మలేరియా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తాయట. అయితే దోమలు కొంతమందిని మాత్రం చాలా ఎక్కువగానే కుడుతూ ఉంటాయి.. అందుకు గల కారణం కూడా ఉన్నదట. దోమలు కుట్టడానికి ముఖ్యంగా ప్రధానమైన కారణం మనం ధరించేటువంటి దుస్తులే.. దోమలు లేత రంగు కంటే ముదురు రంగు దుస్తులను చాలా ఆకర్షిస్తాయట. ముఖ్యంగా స్లీవ్ బట్టలు, పోట్టి బట్టలు ధరించిన వారిని ఎక్కువగా కొట్టడానికి ఆస్కారం ఉంటుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డెంగ్యూకి కారణమైన ఏడిస్ దోమ కేవలం చేతులకు మాత్రమే ఎక్కువగా కుడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మలేరియాను వ్యాప్తి చిందించే దోమ కాళ్లపై కొట్టడానికి ఎక్కువ మక్కువ చూపుతోందట.. అందుకే వర్షాకాలంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దుస్తులను ధరించడం మంచిదని నిపుణుడు సైతం తెలియజేస్తున్నారు. మరి కొన్ని బ్లడ్ గ్రూపులు కలిగి ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయట.. ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులనే దోమలు ఎక్కువగా కుట్టడానికి ఆస్కారం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే శరీర ఉష్ణోగ్రత వేడిగా ఎప్పుడు ఉంటుందో వారిని కూడా కుడతాయని నిపుణులు తెలుపుతున్నారు.