పాకిస్తాన్‌లో ఆడపిల్లల కనీస పెళ్లి వయస్సు ఇదే... షాక్ అయిపోతాం..?
- పాకిస్తాన్ లో 16 ఏళ్ల కే బాలిక ల కనీస వివాహ వయస్సు
- దేశంలో 30 % బాలికలకు 18 ఏళ్ల లోపే వివాహాలు
ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల రేటు అత్యధికంగా ఉన్న దేశాలలో మన పొరుగు దేశం పాకిస్తాన్ ఒకటి. ఈ దేశంలో దాదాపు 30 % మంది బాలికలు 18 సంవత్సరాలు నిండకముందే వివాహం చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. యూనిసెఫ్ నివేదిక ప్రకారం ఈ దేశంలో 19 మిలియన్ల మంది బాలికలు 18 సంవత్సరాల లోపు ... 4.6 మిలియన్ల మంది బాలికలు 16 ఏళ్లలోపు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అంతర్జాతీయ ప్రమాణాలు చూస్తే స్త్రీ - పురుషులకు పెళ్లి చేసుకునేందుకు కనీస వయసు 18 ఏళ్లుగా ప్రకటించారు. అయితే పాకిస్తాన్లో పెళ్లి చేసుకునేందుకు చట్టబద్ధమైన వయసు అబ్బాయిలకు 18 సంవత్సరాలు ... అమ్మాయిలకు 16 సంవత్సరాలు మాత్రమే. ఇక పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్ లో 2013లో ఆడ - మగ వివాహ వయసును 18 సంవత్సరాలకు పెంచడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది చాలా మంచి మార్పు.. కానీ ఈ మార్పు దేశవ్యాప్తంగా వర్తించలేదు. అందుకే బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా బాల్టిస్తాన్ వంటి కొన్ని ప్రాంతాలలో సాంస్కృతిక ... సాంప్రదాయ ... సామాజిక నిబంధనలో కూడా ఆడపిల్లలకు 16 సంవత్సరాలకే పెళ్లి చేయాలన్న పద్ధతి బాగా పాతుకు పోయింది. పెసావర్లో ఇటీవల జరిగిన ఓ సంఘటన బాల్య వివాహ సమస్య దేశంలో ఎలా ? ఉందో చాటి చెప్పింది. 12 ఏళ్ల బాలికతో పెళ్లికి ప్రయత్నించిన 72 ఏళ్ళ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తండ్రి తన కుమార్తెను ముసలి పెళ్లి కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఐదు లక్షల పాకిస్తానీ రూపాయల కు అమ్మేందుకు అంగీకరించాడు. అయితే ఈ కేసులో వరుడు ని పోలీసులు అరెస్టు చేయగా బాలిక తండ్రి మాత్రం తప్పించుకున్నాడు.