తాటి బెల్లం తినడం వల్ల ఏమవుతుందో తెలుసా..!

lakhmi saranya
చాలామందికి డయాబెటిస్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల చక్కెరను తగ్గించి తినాలి. చక్కెర కంటే బెల్లమే ఆరోగ్యానికి మంచి చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ తాటి బెల్లం తింటే కలిగే లాభాలు మాత్రం చాలా మందికి తెలియవు. మీకు తెలుసా? తాటి బెల్లం తినడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం. తాటి బెల్లం తినడం వల్ల మనకు కలిగే ప్రధాన ఆరోగ్య ఉపయోజనాల్లో..ఆహార జీర్ణ క్రియ కు సహాయపడే సామర్థ్యం ఒకటి. ఈ బెల్లాన్ని తినడం వల్ల ప్రేగు కదలికలను నియంత్రిణలో ఉంటాయి.

మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణక్రియ కు సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. తాటి బెల్లం లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, పొటాషియంతో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తాటి బెల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటూ వ్యాధులతో పోరాటానికి సహాయపడతాయి. తాటి బెల్లాన్ని తింటే దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న అంటువ్యాధులు, వ్యాధులు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

తాటి బెల్లాన్ని మధుమేహులు కూడా ఎంచక్కా తినొచ్చు. తాటి బెల్లం లో తెల్ల చక్కెరతో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అండే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. కానీ డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తక్కువగా తినాలి. తాటి బెల్లం లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని రోజు లిమిట్ లో తింటే మంచి ప్రయోజనాలను పొందతారు. మీరు కూడా ఈ తాటి బెల్లాన్ని తప్పకుండా తినండి. తినటం వల్ల డయాబెటిస్ సమస్య రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: