గుండెపోటుకు ముందు కనిపించే సాధారణ లక్షణాలు ఇవే?

Purushottham Vinay

 గుండెపోటు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము. కానీ అది వచ్చేముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి తెలుసుకుంటే ముందే జాగ్రత్త పడొచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రిపూట నిద్ర లేకపోవడం ఈ రోజుల్లో కామన్ విషయంగానే చూస్తున్నాం.కానీ ఇది చాలా ప్రమాదం. అందుకే వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.అలాగే తలతిరగడం అనేది కూడా మామూలుగా అనిపించే తలనొప్పిగా కొట్టిపారేస్తూ ఉంటాం. అసలు ఆలోచనకు కూడా ఇలా ఎవరికీ అనిపించదు.పదే పదే ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.ఇక చెమట పట్టడం అనేది కూడా అందరిలో కనిపించే లక్షణమే.. కానీ తరచుగా చమట ఎక్కువగా పడుతూ ఉంటే కనుక దీనిని అనుమానించాల్సిందే. ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్, మెదడు వ్యాధులు ఇంకా మందులు లేదా ఒత్తిడి వల్ల చల్లని చెమటలు సంభవిస్తాయి. ఇంకా అలాగే అజీర్ణం, వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు గుండె వైఫల్యానికి కారణం కావచ్చు. వీటిని జీర్ణ సమస్యలుగా అనుకుని మనం పొరపాటు పడుతూ ఉంటాం.

అందుకే ఆందోళన చెందకుండా వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. ఇంకా అలాగే శరీరం బరువు ఈజీగా పెరిగినపుడు మనం తెలుసుకుంటూనే ఉంటాం కానీ ఇది గుండె జబ్బులకు సంబంధించి అనే ఆలోచన చేయం.. ఇలా జరిగినా కూడా గుండె పోటే అని అనుమానించాల్సిందే. ఈ లక్షణం కూడా గుండె జబ్బుకు ప్రధాన కారణం కావచ్చు. ఇంకా అలాగే విపరీతమైన శారీరక శ్రమ, నొప్పి, డిహైడ్రేషన్ అనేక కారణాల వల్ల అపస్మారక స్థితి ఏర్పడుతుంది. మెదడులో రక్తం లేకపోవడం మూర్చకు దారితీయవచ్చు. రక్తపోటు తగ్గడంతో ప్రారంభమై రక్తంలో ఆక్సిజన్ కొరతకు కారణం అవుతుంది.ఇంకా అలాగే అలసట అనేది శరీరానికి అలవాటైన పరిస్థితే అయితే శరీరం బలహీనత స్థితిలో ఉండటం, శరీరం నిద్ర కోరుకునే స్థితి, తక్కువ శక్తి, బలం లేక ఉండటం...తరచుగా అలసిపోవడం, మరీ ఎక్కువగా ఇలా అనిపిస్తే కనుక ఇది ఖచ్చితంగా కార్డియాక్ అరెస్ట్ అనే హెచ్చరిక కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే గుండె పోటుతో మరణించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: