నిద్రించే ముందు వీటిని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

Divya
సాధారణంగా రాత్రి పడుకునే ముందు కొంతమందికి కొన్ని రకాల పండ్లు తినడం అలవాటు ఉంటుంది. మరి కొంతమంది పాలు లాంటివి తాగి పడుకుంటూ ఉంటారు. అయితే రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఇబ్బంది లేదు కానీ ప్రత్యేకించి కొన్ని రకాల పండ్లు తింటే మాత్రం ఎన్నో రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రిపూట పడుకునే ముందు ఎటువంటి పండ్లు తినకూడదు? తింటే ఏమవుతుందో? ఇప్పుడు చూద్దాం..
రాత్రి పడుకునే ముందు పైనాపిల్ పండు లాంటివి తినకూడదు.. ఇవి ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి.. కాబట్టి వీటిని తింటే గుండెల్లో మంటతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనాపిల్ తినకండి.
బాగా పుల్లగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లను కూడా అసలు తినకూడదు. వీటి వల్ల కూడా గుండెలో మంట వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక రాత్రిపూట అధిక స్థాయిలో నీటి శాతం కలిగిన పుచ్చకాయలు తినకూడదు.వీటిని తింటే రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
మామిడి పండ్లను కూడా రాత్రి పడుకునే ముందు తినకూడదు. ఎందుకంటే వీటిలో అధిక స్థాయిలో షుగర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు మామిడిపండు తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగి డయాబెటిస్ కు దారితీస్తుంది.
కివి పండ్ల లో ఫైబర్ స్థాయిలో ఎక్కువగా ఉండటం వల్ల రాత్రివేళ తింటే కడుపులో గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. అలాగే లూజ్ మోషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే..
ఇక రాత్రి పడుకునే ముందు బొప్పాయి పండు కూడా తినకూడదు. దీనిని తినడం వల్ల ఇందులో ఉండే ఎంజైమ్స్ జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపి కడుపు సంబంధిత సమస్యలను తీసుకొస్తాయి.
రాత్రిపూట దానిమ్మ , జామ పండ్లు వంటివి కూడా తినకూడదు.. జామకాయలు రాత్రిపూట తినడం వల్ల అవే త్రేన్పులు, కడుపులో అసౌకర్యం కలుగుతుంది.. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చెప్పిన పండ్లను తినకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: