చీర కట్టుకుంటున్నారా.. క్యాన్సర్ బారిన పడ్డట్టేనా..?

Divya
క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా వణుకు పడుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తూ ఉన్నారు. అయితే క్యాన్సర్ రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నప్పటికీ కానీ చాలా మందికి చీర క్యాన్సర్ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ ఇది ఆడవాళ్లకు చాలా ముప్పుగా మారుతోందట.. అసలు ఈ చీర క్యాన్సర్ అంటే ఏమిటో ఇప్పుడు ఒకసారి పూర్తిగా చూద్దాం..
ఇండియాలో ఆడవాళ్లకు చీరలు అంటే చాలా ఇష్టము రకరకాల చీరలను కొంటూ తీసుకుంటూ ఉంటారు. ఈ చీరలు ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు వరకు ఉంటాయి.. ఆడవాళ్ళ అందాన్ని పెంచే ఈ చీరలు క్యాన్సర్ కు కారణమవుతున్నాయని ఇటీవల ఒక పరిశోధనలో బయటపడిందట.. అయితే ఈ చీర క్యాన్సర్ ఎక్కువగా ఇండియాలోనే కనిపిస్తోందని అందుకు కారణం ఆడవాళ్లు చీరలు ఎక్కువగా కట్టుకోవడమే అన్నట్లుగా తెలుస్తోంది.. చీరను కట్టుకోవాలంటే చాలామంది కాటన్ పెటికోట్ వంటివి ధరిస్తూ ఉంటారు.

ఆడవాళ్లు నడుము చుట్టూ చాలా గట్టిగా కట్టుకోవడం వల్ల ఎక్కువ సేపు ఇలా టైట్ గా ఉండే దుస్తులను ధరించడం వల్ల నడుము చర్మం చాలా దెబ్బతింటుందట.. దీనివల్ల చర్మం నల్లగా మారి రోజు ఇలా కావడం వల్ల క్యాన్సర్ కు కారణమవుతుందని.. నిపుణులు వైద్య పరిశోధనలో  దినిని స్క్వామన్ సెల్ కార్సినోమా అని పిలుస్తారట. వాస్తవానికి చీర క్యాన్సర్ చీర వల్ల కాదు పరిశుభ్రత లేకపోవడం వల్లే వస్తుందట.. క్యాన్సర్ ఎక్కువగా వేడి తేమ వల్ల వస్తుందంటూ నిపుణులు వెల్లడించారు.. ప్రస్తుతం అయితే ఎక్కువగా బీహార్ జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయట.. మనదేశంలో నమోదయ్య చీర క్యాన్సర్ కేసులు ఒక్క శాతంగా ఉన్నాయట.. ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో పరిశోధనలు జరపగా చీరతో పాటుగా ధోతిని కూడా చేర్చారు.. 68 ఏళ్ల మహిళకు చీర క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: