పుట్టగొడుగులతో టేస్టీ హెల్తీ బిర్యాని?

Purushottham Vinay
పుట్టగొడుగులు పేరు వినే వుంటారు.పల్లెటూరి వాళ్లకి వీటిని కొనాల్సిన అవసరం లేదు.చక్కగా వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న పొలాలలో ఇవి దొరుకుతాయి.ఇవి ఎక్కువగా పొలాల గట్టు మీద మట్టి పుట్టలమీద గొడుగు ఆకారంలో మోలుస్తూ ఉంటాయి.కొంతమంది వీటిని పెంచుతూ ఉంటారు.అయితే వాటంతటా అవే పెరగటం వల్ల వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది.పెంచే పుట్టగొడుగులలో ఆ టేస్ట్ ఉండదు.వర్షాకాలంలో అయితే ఇవి ఎక్కువగా పుట్టుకొస్తూ ఉంటాయి.వీటిని కర్రీ చేసుకొని తింటే ఆ రుచే వేరు.చికెన్,మటన్ కూడా పనికిరాదు.ఈ పుట్టగొడుగుల కూర అంత రుచిగా ఉంటుంది.మరి చికెన్,మటన్ తో పోటీ పడే ఈ పుట్టగొడుగులతో చేసిన బిర్యాని ఎలా ఉంటుందో చూద్దామా!మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ఓ లుక్ వేయండి.ఒక గిన్నెలో నూనే వేసుకొని చెక్క,లవంగం,యాలక్కాయ,బిర్యానీ ఆకు,మిగతా పలావు దినుసులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి.వాటిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.


అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.తర్వాత అందులో కొన్ని క్యారెట్ ముక్కలు,కొన్ని టమాట ముక్కలు,వేసి మూడు నిముషాలు మగ్గనివ్వాలి.అందులోనే పుట్టగొడుగుల ముక్కలు కూడా వేసి ఇంకో రెండు నిముషాలు మగ్గనివ్వాలి.తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని మరో రెండు నిముషాలు మగ్గనివ్వాలి.తర్వాత మూడు గ్లాస్ ల వాటర్ పోసి,కొత్తిమీర,పుదీనా,ఉప్పు,గరం మసాల వేసి శుభ్రంగా కలిపి ఎసురు బాగా తెర్లనివ్వాలి.ఎసురు బాగా మరుగుతున్నపుడు,రెండు గంటలు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి.రైస్ ని బాగా కలిపి మూత పైన ఎయిర్ పోకుండా బరువు పెట్టుకోవాలి.ఇలా పది నిముషాలు సన్నని మట్టపై ఉడికించుకోవాలి.తర్వాత రైస్ ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.అంతే ఘుమఘుమలాడే పుట్టగొడుగుల బిర్యాని రెడీ.అంతే ఇక వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇంటిల్లపాది ఓ పట్టు పట్టండి.ఇలా వెరైటీగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి క్రొత్తగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: