ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు?

Purushottham Vinay
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కువ సేపు కూర్చొడం వల్ల ఇంటర్వర్‌టెబ్రల్ డిస్క్‌లపై ఒత్తిడి పడుతుంది. డిస్క్ హెర్నియేషన్ లేదా ఉబ్బెత్తు ప్రమాదం పెరుగుతుంది.ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముక తక్కువ ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. వెనుక కండరాలు, స్నాయువులు సంకోచించడం, బిగుతుగా ఉండటమే దీనికి కారణం.ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్నెముక వెనుక కండరాలు బలహీనపడి చివరికి వెన్నెముకపై ఒత్తిడి ఏర్పడుతుంది.ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముక, మెడపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల డిస్క్, వెన్నెముక సమస్యలు వస్తాయి.


ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎముకలు, కండరాల కదలిక తగ్గుతుంది. తద్వారా అవి బలహీనంగా మారుతాయి. ఇది ఆస్టియోపోరోసిస్, పడిపోవడం, వెన్నునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కూర్చోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు కూడా పెరుగుతాయి.శరీరంలో ఇన్సులిన్ చర్య ప్రభావితం అవుతుంది. ఇది క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.అలాగే మన శరీరంలో క్యాలరీల బర్నింగ్ తగ్గుతుంది. ఇది క్రమంగా బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.


ఊబకాయం అనేక ఇతర తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. ఇది తరువాత అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈరోజుల్లో ఆఫీసులో గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం సర్వసాధారణమైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే కొనసాగుతుంది. అంటే, మనం టీవీ చూస్తున్నప్పుడు, తినేటప్పుడు లేదా మొబైల్ ఫోన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు కూడా కూర్చునే ఉంటాము. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: