క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇంకా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే దీనిని తినే ఆహారంలో చేర్చుకోండి. అయితే గౌట్ ఆర్థరైటిస్, హైపో థైరాయిడ్ వంటి శారీరక సమస్యలున్నప్పుడు క్యాబేజీని తినకపోవడమే మంచిది.క్యాబేజీ రసం తీసుకుంటే అజీర్ణం, అపానవాయువు, గుండెల్లో మంట, గ్యాస్, మలబద్ధకం నుండి అల్సర్ల వరకు కడుపు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది. డైటరీ ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ కూరగాయ మధుమేహం నియంత్రలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఏది ఎక్కువైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. క్యాబేజి ఎక్కువ తిన్నా ఆరోగ్యానికి అంత మేలు జరగదు. ఇక అలాంటప్పుడు ముందుగా కొద్ది మొత్తంలో తినడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తుందో లేదో చూడండి. ఏదైన సమస్య ఉంటే క్యాబేజీని తినకపోవడమే మంచిది.క్యాబేజీ కడుపు నొప్పి, పేగు అల్సర్‌లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే శరీరంలో ఏదైనా జబ్బు ఉంటే ఈ కూరగాయ తినకూడదు.
నిజానికి పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యాబేజీ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.దీనివల్ల గ్యాస్ట్రిటిస్ పెరుగుతుంది. క్యాబేజీ అపానవాయువుకు కారణమవుతుంది. క్యాబేజీ, బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు కడుపులో గ్యాస్‌ను కలిగిస్తాయి.క్యాబేజీలో ఫాస్పరస్, కాల్షియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు వివిధ ఎముక సమస్యలను తొలగిస్తాయి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాబేజీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత ఎముకల సమస్యల నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది.ఈ క్యాబేజీలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.క్యాబేజీ అపానవాయువుకు కారణమవుతుంది. క్యాబేజీ, బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు కడుపులో గ్యాస్‌ను కలిగిస్తాయి.కాబట్టి క్యాబేజి ఎక్కువగా తినకండి. కేవలం మితంగా మాత్రమే క్యాబేజిని తినండి. దీన్ని మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మితంగా మాత్రమే తినండి.