కీళ్ల నొప్పులు రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి?

Purushottham Vinay
కీళ్ల నొప్పులు రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి?

మనం కీళ్ల నొప్పుల సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.చలి కాలంలో కీళ్ల నొప్పులు ఉన్నవారు తప్పకుండా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆహారాలు కీళ్లపై ప్రభావం చూపి నొప్పులను మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు బఠనీలు, బంగాళదుంప, టమాటో, తేనె కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా శీతాకాలం మొత్తం వీటికి దూరంగా ఉండడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.కొంతమంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు కంటిన్యూగా పనిచేస్తూ ఉంటారు. దీని కారణంగా శీతాకాలంలో కీళ్ల నొప్పులు మరింత పెరగడమే కాకుండా శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


కాబట్టి ఈ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.కీళ్ల నొప్పులు ఉన్నవారు తప్పకుండా రాత్రిపూట తగిన మోతాదులో నిద్రపోవడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది రాత్రిపూట ఐదు నుంచి ఆరు గంటల పాటు నిద్రపోతున్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఇలా చేస్తే నొప్పులు మరింత తీవ్రతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం చాలా మంచిది.చలి కాలంలో కీళ్ల నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం కొంతమందిలో ఒత్తిడి పెరగడమేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల కూడా మంచి లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కీళ్ల నొప్పుల సమస్యల బారిన పడకుండా ఉండడానికి కీళ్ల నొప్పులు రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: