నిద్రలేమితో వచ్చే భయంకర జబ్బులు ఇవే?

Purushottham Vinay
మనకు ప్రతి రోజు నిద్ర తగినంత లేకపోతే అది చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చర్మం కాంతివిహీనంగా మారిపోతుంది. అంతేకాదు.. నీరసం, పొడిబారడం, ముడతలు, మొటిమలు, తామర వంటి చర్మ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.గుండె జబ్బులు, మధుమేహం వంటి ఇతర అనారోగ్య సమస్యలతో సహా వివిధ ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి.ఆకలి నియంత్రణ కోల్పోతారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. లైంగిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వివిధ హార్మోన్లలో సాధారణ నియంత్రణకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది.నిద్రలేమి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం ముప్పు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.అలాగే హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌లు వంటి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.నిద్ర లేమితో ఆకలి పెరగడమే కాదు.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆకలి, అనారోగ్యకరమైన ఆహారంపై కోరికలు పెరుగుతాయి.


కాలక్రమేణా బరువు పెరగడంతో పాటుస్థూలకాయానికి దారితీస్తుంది.తగినంత నిద్ర లేకపోవడంతో చిరాకు, మానసిక కల్లోలం, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య రుగ్మతల ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది.నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.ఏ పని సరిగా చేయలేరు. శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు, మిషన్లను ఆపరేట్ చేస్తున్నప్పుడు లేదా ఇతర ప్రమాదకరమైన పనులను చేస్తున్నప్పుడు ప్రమాదాలను పెంచుతుంది.నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, శ్రద్ధ కోల్పోవడం, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రతను కోల్పోతారు. విద్యలో వెనుకబాటు లేదా పనితీరుకు మందగించడం వంటివి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలంటే కనీసం ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు తగినంత నిద్ర పోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: