పెళ్లి కానీ వారు ఇలా చేస్తే చాలు పెళ్లి కాయం..!

Divya
మన సాంప్రదాయంలో ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క నివారణ ఉంటుంది.చాలామంది ఆడపిల్లలు పెళ్లి సరైన వయసులో పెళ్లి కాక లేదా సరేనా వ్యక్తి దొరకక పెళ్లి బాజాలు మోగించకుండా ఉంటారు.అలాంటి వారి కోసం ధనుర్మాసంలో చేసే పూజలు చాలా బాగా సహాయపడతాయని వేద పండితులు సైతం చెబుతున్నారు.ఈ ధనుర్మాసానికి అధిపతి గోదా దేవి మరియు రంగానాధుడు.వీరికి ఆచరించే పూజల వల్ల మరియు వ్రతాల వల్ల తొందరగా పెళ్లి సెట్ అవ్వడం అది మరియు అందులోనూ సద్గునుడైన భర్త లభిస్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయి.అసలు ఈ మాసంలో ఎలాంటి పూజలు నిర్వహించాలో మనము తెలుసుకుందాం పదండి..

ధనుర్మాసంలో ఈ పూజలను సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించాలి.ఎవరైతే పెళ్లి కాక ఎక్కువ రోజులపాటు అలాగే వేచి చూస్తూ ఉంటారో,అలాంటి ఆడపిల్లల కోసం ఇదొక మంచి వరమని చెప్పవచ్చు. దీని కోసం ఆడపిల్లలు ఉదయం లేవగానే,తలార తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి.అ తరువాత పూజ గదిలో పూజను ఆచరించి,రంగనాథుడి కోసం ఒక పీట వేసి దానిపై కొత్త క్లాత్ నీ కప్పాలి.ఆ తరువాత దానిపై ధనుర్మాసం ముగ్గులు వేసి,గోదాదేవి సమేత రంగనాథుని పటం కానీ,విగ్రహాలు కానీ ఉంచాలి.ఇప్పుడు పిండి ముద్దలను తీసుకొని,ఏడు ప్రమిదలను తయారు చేసుకోవాలి.ఆ తర్వాత దేవుళ్లను పూలతో అలంకరించి దీపాలను వెలిగించాలి.ఇప్పుడు గోదాదేవి ప్రసన్నం కావడానికి,తిరుప్పావై పారాసురాలు,సోడా చూపచార పూజలు,నిర్వహించాలి.

ఈ పూజను ఆచరించేవారు కచ్చితంగా బ్రహ్మచర్యము మరియు ఉపవాస దీక్షలు చేయాలి.మరియు మాంసం మద్యానికి దూరంగా ఉండాలి.ప్రసాదంగా గోదాదేవికి బియ్యం పరమాన్నం చేసి,ఆ దేవికి సమర్పించిన తర్వాత కనీసం ముగ్గురకైనా పంచి పెట్టాలి.ఈ పూజ నిర్వహించడం అయిపోయిన తర్వాత పగటిపూట నిద్రించకూడదు.ఆ సమయంలో లలితా సహస్రనామం కానీ,విష్ణు సహస్రనామం కానీ చదువుకోవడం చాలా ఉత్తమం.

ఈ పూజలను కేవలం ఆడపిల్లలే కాక ఆర్థిక సమస్యలు ఉన్నవారు,ఉద్యోగ సమస్యలు ఉన్నవారు కూడా చక్కగా ఆచరించి,వారి సమస్యలకు దారి వెతుక్కోవచ్చు.మీరు కూడా పెళ్లికాని ఆడపిల్లలైతే వెంటనే ఈ ధనుర్మాసం దీక్షను చేపట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: