చక్కెర కంటే బెల్లం బెటర్ అని మీకు తెలుసా..!
బెల్లం సహజం స్విట్నర్ అని చెప్పవచ్చు.ఇందులో విటమిన్లు,ఐరన్,మెగ్నీషియం,పోటాషియం,విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు,మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
చక్కెరను అధికంగా వాడటం వల్ల ఇది డైరెక్ట్ గా గ్లూకోజ్ ను అధిక ఉత్పత్తి చేసి,రక్తంలో తొందరగా కలిసిపోతుంది.దీనివలన అధిక గ్లూకోజ్ లు ఖర్చు కాక రక్తంలో గుమిగూడుతాయి.దానితో తొందరగా చాలామంది మధుమేహానికి గురవుతున్నారు.
ప్రపంచంలో వందకి 90 మంది మధుమేహానికి గురవుతున్నారని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
చక్కెరకు బదులుగా బెల్లంని వాడడంతో,ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా,మలబద్ధకం,గ్యాస్,అజీర్తి వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.ఇది జీర్ణవ్యవస్థకు సహజమైన క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.అంతేకాక విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా లభించి,గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.దీనితో గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.మరియు రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. బెల్లంతో పాటు వేరుశనగలు కానీ బాదం కానీ కలిపి తీసుకోవడంతో అధిక రక్త కణాలు వృద్ధి చెందుతాయి. స్త్రీలలో హార్మోన్ ఇంబాలన్స్ ని కూడా బ్యాలెన్స్ చేయడంలో సహజంగా సహాయపడుతుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.అంతేకాక సీజనల్ గ వచ్చే జలుబు,దగ్గు చికిత్సకు ఇంటి నివారణగా ఉపయోగించబడుతుంది.కావున మీరు కూడా ఇక నుంచి చక్కెర బదులుగా బెల్లం వాడడం ఉత్తమం.