చలికాలంలో ఈ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది?

Purushottham Vinay
ఆవాల లాగే ఆవాల నూనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మన పూర్వకాలంలో ఆవాల నూనెను వంటల్లో ఎక్కువగా వాడే వారు. ఇంకా అలాగే ఇంటి వైద్యంలో కూడా ఈ ఆవాల నూనెను వాడే వారు. కానీ క్రమంగా ఈ ఆవాల నూనెను వాడడం తగ్గిపోయింది. ఆవాల నూనెను వాడడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చలికాలంలో ఈ ఆవాల నూనెను వాడడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.మనం తినే వంటల్లో ఆవాల నూనెను వాడడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఆవాల నూనెను వాడడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే ఆవాల నూనెలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.


ఆవాల నూనెను వాడడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కూడా ఉంటాము. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇంకా అలాగే ఈ నూనెను వాడడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.ఇంకా మనం తిన్న ఆహారం కూడా చాలా సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఆవాల నూనెను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ నూనెను వాడడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. మన శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఇది చర్మానికి, జుట్టుకు కూడా ఈ నూనె ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెను వాడడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఆవాల నూనె మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని  ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: