దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!
1). తులసి మొక్క:
ఈ మొక్క వల్ల ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి.. వీటి ఆకులు కూడా ఎన్నో రకాల వాటికి ఉపయోగపడుతుంది. తులసి మొక్క ఉన్నచోట దోమలు రాకుండా చూస్తుందట. తులసి ఆకులు రసాన్ని ఒంటికి రాసుకున్నట్లు అయితే దరిచారు.
2). బంతిపూలు:
ఈ బంతిపూల మొక్కలు ఇంటి ఆవరణంలో అక్కడక్కడ వేసినట్లు అయితే ఈ బంతిపూల వాసనలకు దోమలు దగ్గరికి కూడా రావట.బయటకాని ఎక్కడైనా ఇ బంతి పూల చెట్లు ఉంచితే దోమలు సైతం అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అయితే ఇందులో సపోనేస్ అనే సమ్మేళనం ఉంటుందట. దీనివల్ల దోమలు దూరంగా వెళ్లిపోతాయి.
3). రోజార్ని మొక్క:
ఈ మొక్క యొక్క పూల ఆకుల రసం వల్ల కూడా దోమలు ఇంటి ఆవరణంలో కనిపించవు. ఈ మొక్క అంతా కూడా నీరు గానే నిండి ఉంటుంది కనుక.. వీటి దగ్గరికి కూడా దోమలు రావు. ఈ మొక్క నుంచి నూనె కూడా తీసి బయట అమ్ముతూ ఉంటారు దీనిని శరీరానికి రాసుకున్న దోమలు కుట్టవట.
ఇదే కాకుండా లావెండర్ మొక్క నుండి విడుదలయ్యే స్మెల్ కూడా పలు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఈ మొక్కను కూడా ఇంటి ఆవరణంలో పెంచుకుంటే దోమలు ఈగలు ఇతర పురుగులు కూడా దరి చేరవు.