పసిపిల్లల ఏడుపుని సింపుల్ గా ఆపే టిప్?

Purushottham Vinay
పసిపిల్లలు ఏడవడం చాలా సహజం. ఆకలైనా, నొప్పి కలిగినా, భయమేసినా వెంటనే వారు ఏడుస్తారు. ఈ క్రమంలో అలా ఏడ్చే పసికందులను చూస్తే వారి తల్లిదండ్రులకు పాపం ఏం చేయాలో తెలియదు.అందువల్ల వారిని ఎత్తుకోవడం, లాలించడం, బుజ్జగించడం వంటి పనులు చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల కొందరు ఏడుపు మానేస్తారు.కానీ కొందరు మాత్రం ఎంత సేపైనా కూడా అలాగే ఏడుస్తూనే ఉంటారు. అయితే అలా బాగా సేపు ఏడ్చే చిన్నారులను కేవలం 1 నిమిషంలోనే ఏడుపు మాన్పించవచ్చు. ఇంకా అలాగే అనారోగ్య సమస్యలను కూడా కొన్ని టిప్స్‌తో ఈజీగా దూరం చేయవచ్చు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల్లో కొంత సేపు ఒత్తిడిని కలగజేస్తూ అక్కడ సున్నితంగా మసాజ్ చేయడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను ఈజీగా నయం చేసుకోవచ్చని విన్నాం కదా. ఇక దాన్నే రిఫ్లెక్సాలజీ అని, ఆక్యుప్రెషర్ అని కూడా పిలుస్తారు.కాలి బొటన వేలి చివరి భాగాలను కొంతసేపు సున్నితంగా మసాజ్ చేయాలి. అందువల్ల తల, దంతాల సమస్యలు పోతాయి. అయితే చిన్నారులకు పళ్లు వస్తున్న సమయంలో ఇలా చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం ఉంటుంది.



చిన్నారులు సైనస్ వంటి శ్వాస కోశ సమస్యలతో బాధపడుతుంటే కాలి బొటన వేళ్ల మధ్యలో సాఫ్ట్ గా కొంత సేపు మసాజ్ చేయాలి. అందువల్ల ఆ సమస్యల నుంచి చిన్నారులకు మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే పాదంపై ఒత్తిడిని కలగజేస్తూ ఆ ప్రాంతంలో కొంత సేపు మసాజ్ చేస్తే దగ్గు, జలుబు వంటి సమస్యలు ఈజీగా తగ్గిపోతాయి.కొంతమంది పిల్లలకు ఛాతి, కడుపు మధ్య భాగానికి నొప్పి వస్తుంటుంది.ఇక దీన్నే సోలార్ ప్లెక్సస్ అని పిలుస్తారు. అయితే దీన్ని తగ్గించాలంటే కాలి వేళ్ల పైభాగాల్లో మసాజ్ చేయాలి. పాదంపై వంకరగా, ఆర్క్ రూపంలో ఉన్న ప్రాంతంలో మసాజ్ చేస్తే పిల్లలకు జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. అదే ఆర్క్ కింది భాగంలో మసాజ్ చేస్తే మలబద్దకం, గ్యాస్ తొలగిపోతుంది. కాలి మడమలపై మసాజ్ చేస్తే కండరాల సమస్యలు పోతాయి. ఇంకా అంతేకాకుండా చక్కని శరీర ఆకృతి వస్తుంది. రెండు పాదాలకు కింది వైపు మధ్యభాగంలో మసాజ్ చేస్తే పిల్లలు ఇట్టే ఏడుపును ఆపేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: