ఈ పువ్వుతో భయంకర జబ్బులు మాయం?

Purushottham Vinay
ఈ పువ్వుతో భయంకర జబ్బులు మాయం?


ఎన్నో వేలాది సంవత్సరాలుగా మన వంటకాలలో చాలా రకాల రుగ్మతలకు కుంకుమ పువ్వు ఇంటి నివారణగా ఉపయోగించబడుతోంది. అందుకే కుంకుమపువ్వును చాలా మంది ఎరుపు బంగారంగా చెబుతుంటారు. నీరు, పాలు లేదా ఏదైనా ఇతర ద్రవంలో కుంకుమపువ్వు కలిపితే ఆ ద్రావణం ఈజీగా పసుపు రంగులోకి మారుతుంది. ఈ కుంకుమ పువ్వును మతపరమైన వేడుకలు ఇంకా ఆచారాలలో శుభప్రదానికి చిహ్నంగా భావిస్తారు. కుంకుమపువ్వు హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, కడుపు లోపాలు, డిస్మెనోరియా, అభ్యాసం ఇంకా జ్ఞాపకశక్తి లోపాలను నయం చేయడంలో చాలా మందికి చాలా బాగా సహాయపడుతుంది.కుంకుమపువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అథెరోస్క్లెరోటిక్, యాంటిజెనోటాక్సిక్ ఇంకా సైటోటాక్సిక్ లక్షణాలు ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. చాలా రకాల రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.ఈ కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. దీని సువాసన మూడ్-బూస్టింగ్ , డిప్రెషన్ ఇంకా మూడ్ డిజార్డర్స్లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 



కుంకుమపువ్వు రక్తపోటును తగ్గించటంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.అందువల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ఇంకా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో,డిప్రెషన్ లక్షణాలు పోగొట్టటంలో సహాయపడుతుంది. కుంకుమ పువ్వులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె జబ్బులు, ఊబకాయం, అల్జీమర్స్ ఇంకా మధుమేహంతో బాదపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆకలి ,బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కుంకుమపువ్వులో క్రోసిన్, క్రోసెటిన్ ఇంకా సఫ్రానల్ వంటి సమ్మేళనాలు ఉండటం వల్ల అవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాలు కుంకుమ పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నాయి. ఇది ఇన్ఫ్లమేటరీ పరిస్థితులను నిర్వహించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: