యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని మనం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక మన నిద్ర, రోగనిరోధక వ్యవస్థలు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. మీరు ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల పాటు మంచి నిద్రను పొందకపోతే, మీ రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇంకా బాగా నిద్రపట్టడానికి సహాయపడే కొన్ని హెల్తీ డ్రింక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, బ్యాక్టీరియా-ఫంగల్-వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి పాలలో పసుపును కలుపుకుని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ ఇందుకు సహకరిస్తుంది. రాత్రిపూట పసుపు పాలు తాగడం వల్ల చాలా బాగా నిద్ర పడుతుంది. పసుపు పాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇక ఇది మంచి నిద్రకు సహాయపడటమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఇంకా అనేక ఆరోగ్య వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి.అలాగే అల్లంలో ఉండే జింజెరాల్ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది మీకు మంచి నిద్రను కూడా అందిస్తాయి. అల్లం వ్యాయామం తర్వాత కండరాల నొప్పి, తీవ్రమైన ఋతు తిమ్మిరితో సహా కొన్ని రకాల నొప్పి నుండి ఉపశమనం పొందడంలో బాగా సహాయపడుతుంది. ఇక అల్లంలోని యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపుతాయి.అందువల్ల నోటి దుర్వాసన, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.అల్లం టీలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ రోగనిరోధక శక్తిని ఈజీగా పెంచుతాయి. అలాగే కాలానుగుణ వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుతాయి.అలాగే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వల్ల ఖచ్చితంగా మంచి నిద్ర వస్తుంది.ఇక రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రాత్రి పడుకునే ముందు పిప్పరమెంటు టీ తాగడం మంచిది.