చిన్నారి వయసు 5 నెలలు.. అయినా వరల్డ్ రికార్డు సాధించాడు?
అయితే ఇలా చేయడానికి అయినా సరే చాలా రోజులపాటు ఒకే విషయంపై శ్రమించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాలి. కానీ ఏకంగా ఐదు నెలల చిన్నారి ప్రపంచ రికార్డు సృష్టించింది అంటే ఎవరైనా నమ్ముతారా.. ఐదు నెలల చిన్నారి ఏంటి వరల్డ్ రికార్డు సృష్టించడం ఏంటి.. జోకులు వేస్తున్నారా అని అంటారు ఎవరైనా కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ఏకంగా ఐదు నెలల వయస్సు ఉన్న చిన్నారి నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. నల్లజర్ల మండలం గంట వారి గూడానికి చెందిన వీరబత్తిని దిలీప్, రాణి దంపతులకు కుమారుడు మౌర్య ఉన్నాడు. కాగా పుల్లలపాడు సచివాలయంలో ఏఎన్ఎం గా పనిచేస్తున్న రాణి కొంతకాలంగా జంతువులు, పక్షులు, పండ్లు, పువ్వులు, జాతీయ నేతలు, జాతీయ పథకాలు ఇలా వందల్లో పలు రకాల బొమ్మల కార్డులను చూపించి కొడుకు మౌర్యకు పేర్లు చెబుతూ వచ్చింది.
బాలుడు గుర్తుపెట్టుకుంటున్నాడు అన్న విషయాన్ని రాణి గమనించింది. అయితే ఈ విషయం ఆన్లైన్ ద్వారా ఈనెల 1వ తేదీన నోబెల్ వరల్డ్ రికార్డు వారికి తెలియజేశారు. అయితే ఈ నెల 9వ తేదీన పెట్టిన ఆన్లైన్ పరీక్షలో 200 బొమ్మలున్న కార్డులను చిన్నారి మౌర్య ఎంతో సులభంగా గుర్తుపట్టడంతో వరల్డ్ రికార్డులో అతను చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి ఇటీవల తపాల శాఖ ద్వారా ఒక మొమెంటో, రెండు ధ్రువపత్రాలు కూడా చిన్నారి తల్లిదండ్రులకు అందాయి అని చెప్పాలి. అయితే ఇలా ఐదు నెలల వయసులోనే వరల్డ్ రికార్డు సృష్టించడం మాత్రం సంచలనం అని చెప్పాలి.