పారాసిటమాల్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే..!!

Divya
ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అవగాహన లేకుండా చాలామంది జ్వరం వచ్చిన, తలనొప్పి వచ్చిన బాడీ పెయిన్స్ ఉన్నా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా పారాసిటమాల్ కలిగిన మాత్రలు కానీ,సిరప్ లు కానీ వేసుకుంటూ ఉన్నారు.ఒక మోతాదు వరకు పారాసిటమాల్ మన శరీరానికి లాభాలను కలిగించినా,మోతాదు మించితే మాత్రం చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.అస్సలు పారాసిటమాల్ వల్ల మన శరీరానికి ఎలాంటి దుష్ప్రబావాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండీ..

అసలు మన శరీరానికి నాలుగు గ్రాములు కంటే ఎక్కువ పారాసిటమాల్ అందించకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.ఈ మాత్రలతో ప్రయోజనాలు ఎన్ని కలిగినా శ్రుతిమించిన వాడకంతో నష్టాలు కూడా అదే సంఖ్యలో ఉన్నాయని చాలా పరిశోధనలు చేసి మరీ పరిశోధకులు నిరూపించారు.ఈ మాత్రల డోసు అధిగమించితే దాని ప్రభావం ఒక్కొక్కరి శరీరంలో ఒక్కోలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కొంతమందికి వాంతులు,నీరసం,తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు కొంత సమయం విశ్రాంతి తీసుకోవడంతో అ సమస్యలు తొందరగా తగ్గిపోతాయని సూచించారు.పారాసెటమాల్ మాత్రల అధికంగా వాడడంతో కాలేయ పని తీరు దెబ్బతింటుందని హెచ్చరించారు.ఇంకా చెప్పాలంటే కళ్లు,చర్మం పసుపు పచ్చగా మారడం,యూరిన్ రంగు మారడం,కడుపు నొప్పి వంటి పచ్చ కామెర్ల లక్షణాలు ఎన్నో కాలేయ సమస్యలకు ముందస్తు హెచ్చరికలని తెలిపారు.

అంతే కాక ఈ మాత్రల మొతాదు పెరిగిందంటే మాత్రం రక్తస్రావానికి దారితీయొచ్చని,నొప్పికి విరుగుడుగా పని చేసే ఆస్పిరిన్ వంటి మాత్రలతో కలిపి పారాసెటమాల్ ను వేసుకోవడంతో ఈ ముప్పు ఇంకా ఎక్కువ పెరుగుతుందని హెచ్చరించారు.ఇంకొంతమందిలో పారాసెటమాల్ మాత్రల ఓవర్ డోస్ వల్ల అలెర్జీలు కలిగి శరీరంపై దద్దుర్లు,నవ్వలు,పింపుల్స్,శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయట.

కావున పారాసిటమాల్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నాలుగు గ్రాములు కంటే ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.జ్వరం,నొప్పులు కలిగినప్పుడు ఇలాంటి కెమికల్ టాబ్లెట్లను వాడటం కన్నా,ఆయుర్వేద చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: