బొద్దింకలని ఈజీగా తరిమేసే సహజ చిట్కాలు?

Purushottham Vinay
బొద్దింకల ద్వారా ఖచ్చితంగా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవి చాలా రకాల వైరస్ లను, బ్యాక్టీరియాలను వ్యాపింపజేసి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి.అందుకే మన ఇంట్లో మన ఇంటి పరిసరాల్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి. మనకు మార్కెట్ లో బొద్దింకలను నివారించే చాలా రకాల స్ప్రేలు లభిస్తాయి. వీటికి రసాయనాలను ఎక్కువగా వాడతారు.అయితే వీటిని వాడడం వల్ల బొద్దింకల సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. కానీ వీటిని వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా రకాల దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న వారు ఈ స్ప్రేలను వాడే విషయంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే ఇలా రసాయనాలు కలిగిన స్ప్రేలను వాడడానికి బదులుగా కొన్ని సహజ చిట్కాలను పాటించడం వల్ల కూడా మనం బొద్దింకల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.ఇక బొద్దింకలను నివారించే సహజ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బొద్దింకలను నివారించడంలో బిర్యానీ ఆకులు మనకు చాలా సహాయపడతాయి. బొద్దింకలు తిరిగే చోట ఈ ఆకులను ఉంచడం వల్ల బొద్దింకలు వెంటనే పారిపోతాయి.ఇంకా అలాగే కీరదోసల నుండి వచ్చే వాసన కూడా బొద్దికలకు నచ్చదు. బొద్దింకలు తిరిగే చోట కీరదోస ముక్కలను ఇంకా వాటి తొక్కను ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.అలాగే నీటిలో వెనిగర్ ను కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లడం వల్ల వెనిగర్ నుండి వచ్చే వాసన కారణంగా బొద్దింకలు పారిపోతాయి. బొద్దింకలు తిరిగే చోట పొట్టు వలిచి కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలను ఉంచడం వల్ల కూడా బొద్దింకల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ఇంకా అలాగే బొద్దింకలు తిరిగే చోట నిమ్మరసాన్ని స్ప్రే చేయడం ఇంకా నిమ్మతొక్కలను ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో బేకింగ్ సోడా అలాగే పంచదార కలిపి బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు ఈజీగా నశిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: