బ్రష్ చేయకుండానే నీటిని తాగడం మంచిదేనా..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ అని బెడ్ కాఫీ అని చాలా రకాల వాటిని ఫాలో అవుతూ ఉన్నారు.. మరి కొంతమంది ఉదయం లేవగానే నోటిని శుభ్రం చేసుకునేందుకు నీరు తాగుతూ ఉంటారు ఈ అలవాటు మంచిదని కొంతమంది చెబుతూ ఉంటే మాత్రం మరి కొంతమంది బ్రష్ చేయకుండా ఇలాంటివి చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ కొంతమంది నిపుణుడు తెలియజేస్తున్నారు. అయితే దీనివల్ల అసలు ప్రయోజనాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


పళ్ళు తోముకొనే ముందు నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ముఖ్యంగా చెప్పాలి అంటే ఖాళీ కడుపుతో నీటిని తాగడం లేదా పండ్లు తోముక ముందే నీరు తాగడం వల్ల శరీరం నుంచి చెడు పదార్థాలు తొలగిపోతాయట.. అలాగే ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీటిని తాగడం వల్ల శరీరంలో జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. ఉదయాన్నే బ్రెష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అనేక రకాల వ్యాధులను సైతం దూరం చేస్తుందని ఒక అధ్యయనంలో తెలియజేయడం జరిగింది నిపుణులు.. ఉబకాయం మలబద్ధక సమస్య అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిదట.


ఇది నోటిలోనే ఉండే బ్యాక్టీరియాని చేరకుండా నిరోధించడమే కాకుండా కావిటిస్ అనే ప్రమాద భార్య నుంచి కూడా కాపాడుతుంది నోటి దుర్వాసనను తొలగించడం లో ఇది ఎంతగానో సహాయపడుతుంది.. నోటిలో లాలాజలం లేకపోవడం వల్ల నోరు మొత్తం పొడిగా మారుతుంది. దీని వల్ల హలిటోసిస్ అనే సమస్య కూడా ఎదురవుతుందట. దీన్ని బట్టి చూస్తే ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని అర్థమవుతోంది. అందుకే ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాసు నీటిని అయినా తాగడం చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: