లంగ్స్ క్లీన్ అవ్వాలంటే ఇది తప్పకుండా తినండి?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా ఆస్థమా, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల వల్ల కలిగే బాధ చాలా భయంకరంగా ఉంటుంది.ముఖ్యంగా వర్షాకాలం, చలికాలాల్లో ఈ సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యలతో బాధపడే వారు ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. అయితే మందులతో పాటు వామాకును వాడడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్యలతో బాధపడే వారి ఊపిరితిత్తులల్లో హిస్టమిన్స్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది, చికాకు చాలా ఎక్కువగా ఉంటుంది. హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల శ్లేష్మాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. అందువల్ల ఆస్థమా తగ్గకుండా ఎక్కువ రోజుల పాటు వేధిస్తూ ఉంటుంది. ఆస్థమా, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారు వామాకును వాడడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వామాకులో థైమాల్, కార్వకాల్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులల్లో హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేయడంలో చాలా బాగా సహాయపడతాయి.


ఇక ఈ హిస్టమిన్స్ ఎంత తక్కువగా ఉత్పత్తి అయితే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది అంత తక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే శ్లేష్మాలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. సమస్య కూడా త్వరగా తగ్గు ముఖం పడుతుంది. ఈ విధంగా వామాకు ఆస్థమా ఇంకా న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు.మనం సాధారణంగా వామాకును వంటల్లో వాడుతూ ఉంటాము.వామాకు మంచి వాసనను కలిగి ఉంటుంది. ఈ వామాకు చెట్టును పెంచడం చాలా సులభం. ఇక ముదురు ఆకులను తెంచే కొద్ది ఈ మొక్కకు కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. కుండీల్లో కూడా ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది. ఆస్థమా, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారు ఖచ్చితంగా ఇళ్లల్లో వామాకు మొక్కను పెంచుకోవాలి. దీనితో పచ్చడిని కూడా చేసి తీసుకోవచ్చు. ఇంకా అలాగే నీటిలో వామాకులను వేసి మరిగించి ఈ నీటిని తాగవచ్చు. ఇలా ప్రతిరోజూ కొన్ని వామాకులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆస్థమా, న్యుమోనియా ఇంకా బ్రాంకైటిస్ వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: