ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక ఈ టీ ని తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది.అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల ఖచ్చితంగా చక్కటి ఫలితం ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల ఒక్క నెలల్లోనే 5 కిలోల దాకా బరువు తగ్గవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా అదే విధంగా ఈ టీని తాగడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.ఇంకా శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది.ఇంకా అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మనల్ని ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో అలాగే స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా ఈ టీ మనకు సహాయపడుతుంది. ఇంకా బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇక ఈ టీ ని తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సిన పదార్థం దాల్చిన చెక్క. ఇది దాదాపు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది. మసాలా వంటల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇది వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు దాల్చిన చెక్క మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.ఈ టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వాటిని బాగా వేడి చేయాలి. ఆ నీళ్లు మరిగిన తరువాత రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి మధ్యస్థ మంటపై ఆ నీటిని మరిగించాలి. ఇలా ఒక పది నిమిషాల పాటు మరిగించిన తరువాత ఈ టీ ని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచి కోసం ఒక టీ స్పూన్ తేనెని కలుపుకుని తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన టీ ని రోజూ ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల మనం చాలా వేగంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని తాగుతూనే రోజూ నీటిని కూడా ఎక్కువగా తాగాలి. ప్రతిరోజూ ఖచ్చితంగా ఓ గంట వ్యాయామం చేయాలి. అలాగే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను, ప్రాసెస్ట్ ఫుడ్ ను అస్సలు తీసుకోకూడదు. ఈ టిప్స్ పాటిస్తూ దాల్చిన చెక్క టీ ని తాగడం వల్ల చాలా సులభంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.