పిల్లల్లో బాలనెరుపు పోగొట్టాలి అంటే..ఎలాంటి నూనెలు వాడాలో తెలుసా..?
సాధారణంగా పిల్లల్లో తొందరగా తెల్ల జుట్టు రావడానికి విటమిన్ సి,ఇ,బి7,బి9,బి12,ఐరన్,జింక్ వంటి న్యూట్రియన్స్ లోపం కారణంగా జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.పిల్లల్లో ఈ సమస్యను తగ్గించడానికి మనకి సహజంగా దొరికే నూనెలు చాలా బాగా ఉపయోగపడతాయి.అవి ఏంటంటే..
కొబ్బరినూనె..
ఇది అందరికి తెలుసు కొబ్బరి నూనె మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని.కానీ ఈ మధ్యకాలంలో పిల్లలు ఆయిల్ పెట్టకపోవడమే స్టైల్ అనుకుంటూ ఉంటారు.దానితో జుట్టుకు సరైన పోషకాలు అందకపోవడంతో తెల్లవెంట్రుకలు వస్తాయి.కనుక కనీసం వారానికి రెండు సార్లు అయినా తలకు కొబ్బరి నూనెను పట్టించి,మర్దన చేసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకు నూనె..
కరివేపాకులో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి కనుక,అవి జుట్టు సంరక్షణకు చాలా బాగా తోడ్పాడపడతాయి.దీని కోసం కప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు వేసి,మరిగించి చల్లారాక వడపోసి, దాన్ని మాడు నుంచి కుదుళ్ల వరకు పట్టించి,మర్దన చేసుకోవాలి.ఆ తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం వల్ల బాలనెరుపు తగ్గుతుంది.
కలబందగుజ్జు..
ఇందులో క్యాల్షియం,సెలెనియం,జింక్,క్రోమియం వంటి న్యూట్రియాంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇది జుట్టులో మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడి,తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది.దీనికోసం కలబంధ గుజ్జుకి హెన్నా,కాఫీ డికాక్షన్ కలిపి తలకు రాయడంతో మంచి ఫలితం ఉంటుంది.
భృంగరాజ్ ఆయిల్..
ఈ అయిల్ లో మెలనిన్ ఉత్పత్తికి సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలు అధికంగా లభిస్తాయి.దీనిని రోజూ అప్లై చేయడంతో బాలానేరుపు తగ్గి,జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తాయి.కావున ఈ అయిల్స్ మీ పిల్లలకు అప్లై చేసి,బాలనెరుపు రాకుండా కాపాడుకోండి.