వంటల్లో ఈ పొడి వాడితే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
మనం చేసుకునే వంటల్లో ఎండు మిరపకాయలతో చేసే చిల్లీ ప్లేక్స్ ను వేస్తూ ఉంటాము.  కూరల్లో ఎండు కారం పొడికి బదులుగా పచ్చి మిరపకాయలను వాడడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరికి పచ్చి మిరపకాయల కారం అయితే ఏ మాత్రం పడదు. ఇక అలాంటి వారు పచ్చి మిరపకాయలకు అలాగే వంటల్లో ఎండు కారం పొడిని బదులుగా మిరియాల పొడిని ఉపయోగించవచ్చు. మన పూర్వకాలంలో వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడినే వాడేవారని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ, ప్రేగు పూతలు ఇంకా అల్సర్లు వంటి సమస్యలతో బాధపడే వారు ఎండు కారాన్ని తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.అందుకే అలాంటి సందర్భాల్లో ఎండు కారాన్ని పూర్తిగా మానేయాలి. సాధారణంగా ఎండు కారానికి బదులుగా వంటల్లో మిరియాల పొడి ఇంకా పచ్చి కారాన్ని వాడడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే వంటల్లో మిరియాల పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.ఇంటి చిట్కాల్లో అలాగే దగ్గు ఇంకా జలుబు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు మనం మిరియాలతో కషాయాన్ని అలాగే మిరియాల పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము.


ఈ మిరియాల్లో పెప్పరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అలర్జీలకు కారణమయ్యే హిస్టమిన్ అనేది ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో శ్లేష్మం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. దీంతో మనకు దగ్గు కూడా తగ్గుతుంది. ఇంకా అలాగే మిరియాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో కూడా మిరియాలు మనకు చాలా బాగా సహాయపడతాయి.ఒక 8 వారాల పాటు తగినమోతాదులో మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇంకా ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ విధంగా మిరియాలు మనకు చాలా మేలు చేస్తాయని వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: