కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులని క్షణంలో తగ్గించే చిట్కా?

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పని చేయడం, పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ను, ఆమ్లత్వం కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు వంటి వివిధ కారణాల చేత మోకాళ్ల నొప్పులు ఇంకా కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. చాలా మంది ఈ సమస్య బారిన పడగానే ఎక్కువగా పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు.ఇలా ఈ ఇంగ్లిష్ మందులను వాడడం వల్ల నొప్పుల నుండి ఈజీగా ఉపశమనం కలిగినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. ఇలాంటి మోకాళ్ల నొప్పులు ఇంకా కీళ్ల నొప్పులను తగ్గించడంలో మనకు కుప్పింటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కుప్పింటాకు మనకు ఎక్కువగా పొలాల గట్ల మీద ఇంకా రోడ్డుకు ఇరు వైపులా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కను మనలో చాలా మంది కూడా చూసే ఉంటారు కానీ దీని ఉపయోగాలు తెలియక చాలా మంది దీనిని ఓ పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. మన కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది.


అయితే కీళ్ల నొప్పులతో బాగా బాధపడే వారు ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం శుభ్రమైన ప్రదేశంలో పెరిగిన కుప్పింటాకు మొక్క ఆకులను సేకరించి వీటిని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి.తరువాత ఈ నీటిని అర గ్లాస్ అయ్యే దాకా బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో రెండు టీ స్పూన్ల అల్లం రసం వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే ఈ కుప్పింటాకు ఆకుల రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.ఇంకా దీనికి సమానంగా నిమ్మరసాన్ని కలిపి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఈ విధంగా మోకాళ్ల నొప్పులను ఇంకా కీళ్ల నొప్పులను తగ్గించడంలో కుప్పింటాకు మొక్క మనకు బాగా ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: