అందమైన అమ్మాయి కాదు.. అది ఆలుగడ్డ.. చూస్తే షాకే?
దీంతో తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునేందుకు ఎక్కడికో వెళ్లి.. ఎవరినో బ్రతిమిలాడాల్సిన పని లేకుండా పోయింది. కేవలం అరచేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇక వినూత్నమైన రీతిలో ప్రపంచం మొత్తం తెలిసేలా తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది తమలో దాగి ఉన్న పెయింటింగ్ ప్రతిభను నిరూపించుకునేందుకు వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో కొత్త పెయింటింగ్ లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలోకి వచ్చిన పెయింటింగ్ మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది.
ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన ఒక ఫోటో చూశారు అంటే చాలు వావ్ అమ్మాయి ఎంత అందంగా ఉందో.. బహుశా ఆమె హీరోయిన్ లేకపోతే మోడల్ అనుకుంటా అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకున్నారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఫోటోలో కనిపించేది అమ్మాయి కాదు ఆలుగడ్డ. ఏంటి షాక్ అవుతున్నారు కదా. నిజమే ఇక్కడ ఒక చిత్రకారుడు ఆలుగడ్డకు అమ్మాయి అందాన్ని పొందుపరిచాడు. తన పెయింటింగ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఏకంగా ఆలుగడ్డకు కనుబొమ్మలు కళ్ళు పెదాలు, ముక్కు అన్ని సెట్ చేశాడు. ఆలుగడ్డ చుట్టూ ఒక గుడ్డను అమ్మాయి కప్పుకున్నట్లుగా కట్టాడు. ఈ ఫోటో చూసి ప్రతి ఒక్కరు కూడా అందమైన అని ఫిక్స్ అయిపోతున్నారు కానీ ఆలుగడ్డ అని తెలిసి షాక్ అవుతున్నారు.