అందమైన ముఖం కోసం పచ్చి పాల ప్యాక్ వేయండి..!
పచ్చిపాలు,శనగపిండి ప్యాక్..
దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి,చిటికెడు పసుపు వేసి తగినన్ని పాలు పోసుకొని మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని అప్లై చేయడానికి ముందే మొహం శుభ్రంగా కడుక్కొని అప్లై చేసుకోవాలి.ఇలా అరగంట ఆరిన తర్వాత మర్దన చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల,ముఖంపై ఉన్న మృతకణాలు మరియు జిడ్డు తొలగిపోయి,ముఖం కాంతివంతంగా తయారవుతుంది. శనగపిండిలోని బ్లీచింగ్ గుణాలు,ముఖంపై గల జిడ్డును పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
ముళ్తానా మట్టి, పాల ప్యాక్..
ఈ ప్యాక్ కోసం రెండు స్ఫూన్ల ముళ్తానా మట్టిని తీసుకొని, అందులో సరిపడా పాలు వేసి, బాగా కలపాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు శుభ్రమైన ముఖంపై అప్లై చేయడం వల్ల,క్రమంగా మచ్చలు మొటిమలు మృత కణాలు తొలగిపోయి,ముఖం అందంగా కాంతి వంతంగా తయారవుతుంది.
టమాటా ప్యాక్..
దీనికోసం పాలల్లో ఒక టీ స్పూన్ టమాట రసం, ఒక స్ఫూన్ కాపీపౌడర్ వేసి,బాగా కలపాలి.ఇలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసినా తర్వాత అప్లై చేసుకోవాలి.బాగా ఆరిన తర్వాత మెల్లగా మర్దన చేస్తూ, పేస్ శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ అప్పటికప్పుడు ముఖంలో జిడ్డును తొలగించి,ముఖం కాంతివంతంగా తయారయేలా చేస్తుంది.