ఎక్కువగా అరికాళ్లు మండుతున్నట్లయితే ఈ రోగాలు వున్నట్టే..?

Divya

సాధారణంగా ఒక్కొక్కసారి శరీరంలో అధిక వేడి వల్ల అరికాళ్ళు అరిచేతులు మండుతున్నట్టు అనిపిస్తాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.మరి కొంతమందిలో ఎప్పుడు అరికాలు అరిచేతులు మండుతున్నట్లయితే కొన్ని రోగాలకు దారితీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి రోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
B12 లోపం..
శరీరంలో బి కాంప్లెక్స్ తక్కువ అవడం వల్ల, రక్తం సాఫీగా సరఫరా అవ్వక చివరి రక్తప్రసరణ భాగమైన అరికాళ్లకు, అరిచేతులకు రక్తం వెళ్ళదు.దీనితో అరికాళ్ళు మండుతున్నట్టు అనిపిస్తాయి.ఇలా మరీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటే వైద్యుని సంప్రదించి,B12 మాత్రలను మరియు B12 అధికంగా వున్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి .
మధుమేహం ఉన్నవారికి..
అధిక షుగర్ తో బాధపడే వారికి కూడా అరికాల్లో మంటలు నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి, రక్తం చిక్కబడి రక్త సరఫరా సరిగా జరగక అరికాలో అరిచేతుల్లో మంటలు ఎక్కువగా ఉంటాయి. కావున వీరు మధుమేహం కు తగిన టాబ్లెట్లు తీసుకుని,ఆహార నియమాలు పాటించడం వల్ల మంటలను తగ్గించుకోవచ్చు.
నివారణ చర్యలు..
పైన చెప్పిన అనారోగ్యలకు తగిన ఆహారాలు మరియు టాబ్లెట్లు తీసుకొని కొన్ని రకాల నాచురోపతి వైద్యం చేసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు.దీనికోసం రెండు బకెట్లు తీసుకొని, ఒక బకెట్ లో వేడినీళ్లు ఇంకొక బకెట్లో చల్లని నీళ్లు  తీసుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్ళను వేడి నీటిలో నాలుగు నిమిషాల పాటు ఉంచి, తీసి చల్ల నీటిలో రెండు నిమిషాల పాటు  ఉంచాలి. ఇలా ఒక అరగంట సేపు మార్చి మార్చి చేయడం వల్ల అరికాళ్ళకు రక్త సరఫరా పెరిగి మంటలకు ఉపశమనం కలుగుతుంది. లేదా ఒక తడిబట్ట తీసుకొని, దానిపై రెండు అరికాళ్ళు మోపి ఒక అరగంట సేపు అలాగే ఉంచుకోవడం వల్ల అరికాలో వేడి తగ్గి మంటలు తగ్గుతాయి.మరియు ఆముదపు నూనెను అరికాళ్ళకు మర్దనా చేసుకోవడం వల్ల, వేడి తగ్గి, నొప్పులకు, మంటలకు ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: