పుచ్చకాయతో ట్యాన్ కి బై..చెప్పండి..!

Divya
వేసవికాలం మొదలవగానే ఎండలు మండిపోతూ ఉంటాయి. ఈ సీజన్లో పనిరిత్యా బయట తిరిగేవారికి ముఖం నల్లగా టాన్ అయిపోయి,అంద విహీనంగా తయారవుతుంది.దీనిని ఎంత పోగొట్టుకోవాలని ఎన్ని కెమికల్ ప్రొడక్ట్స్ ట్రై చేసిన ఫలితం అనేది శూన్యము.వీటి కన్నా నాచురల్ గా పుచ్చకాయతో వేసుకునే ప్యాక్ వల్ల తొందరగా పోగొట్టుకోవచ్చని బ్యూటీషియన్స్ సూచిస్తున్నారు.ఈ పుచ్చ కాయరసం ముఖం పై ట్యాన్ పోగొట్టి, తెల్లగా అవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవికాలంలో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకచర్యలు తీసుకోవడం  చాలా అవసరం. మరీ ముఖ్యంగా మహిళలు వేడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవాలి.సాధారణంగా పుచ్చకాయను సహజ టోనర్‌గా ఉపయోగిస్తుంటారు.దీని రసాన్ని చర్మంపై తరుచూ అప్లై చేస్తూ ఉంటే ఇందులోని విటమిన్-సి చర్మం సాగడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా బాగా సహాయపడుతుంది.అంతే కాక కొల్లాజెన్ అనే ప్రొటీన్,ట్యాన్ పోగొట్టడానికి, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.
టాన్ పోగొట్టుకోవడానికి గుప్పెడు పుచ్చకాయ ముక్కలను తీసుకుని, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ ముల్తానా మట్టి వేసి,బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని, ట్యాన్ అయిన ప్రతి ప్రదేశంలోనూ అప్లై చేసుకోవాలి. అరగంట ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా మర్దన చేస్తూ, శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు అప్లై చేసుకోవడం వల్ల ట్యాన్ ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు.
అంతేకాక వేసవికాలంలో చెమటకి ముఖముపై రంద్రాలు దుమ్ము, దూళితో ముసుకు పోయి చర్మం నుండి జిడ్డు ఎక్కువ కారుతుంది. అలాంటివారు పుచ్చకాయ రసంతో ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల దుమ్ము దూలిపోయి చర్మ రంధ్రాలు బాగా ఓపెన్ అవుతాయి. దీనితో జిడ్డు కారడం తగ్గిపోయి, మొటిమలు మచ్చలు రాకుండా కాపాడుతుంది.
ఈ వేసవికాలంలో పుచ్చకాయ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో అధికంగా ఉన్న వాటర్ కంటెంట్ చర్మం డిహైడ్రేషన్ కాకుండా కాపాడటమే కాక, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నీరసం,నిస్సత్తువతో బాధపడేవారికి దీని వల్ల తక్షణశక్తి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: