ముఖంపై నలుపు తగ్గి అందంగా అవ్వాలంటే..?

Purushottham Vinay
ఇక ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది  కూడా వారి ముఖం నల్లగా మారడం, ముఖంపై మృతకణాలు పేరుకుపోవడం, ముడతలు, చర్మ రంధ్రాలు తెరుచుకోవడం ఇంకా అలాగే చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి మొటిమలు వంటివి రావడం ఇలా చాలా రకాల చర్మసమస్యలతో బాధపడుతున్నారు.ఇలాంటి చర్మ సమస్యలకు బియ్యం ఒక చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. బియ్యంతో క్లీన్సర్, స్క్రబర్ ఇంకా అలాగే ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చక్కటి అందమైన ఇంకా ఆరోగ్యవంతమైన ముఖాన్ని చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఇక బియ్యంతో ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఫస్ట్ ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి రెండుసార్లు వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు వాటిని నానబెట్టాలి.ఆ తరువాత ఈ బియ్యం నానబెట్టిన నీటిని ఒక గిన్నెలోకి మీరు తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో రెండు టీ స్పూన్ల పచ్చి పాలను వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఇందులో దూదిని ముంచి మీ చర్మానికి రాసుకోవాలి.


ఇక ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి మొత్తం పోతుంది.అయితే దీనిని రాసుకున్న తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోకూడదు. ఇక దీనిని అలాగే ముఖం మీద ఉంచుకోవాలి.తరువాత నానబెట్టిన బియ్యాన్ని మీరు జార్ లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో తగినన్ని పచ్చిపాలను పోసి బరకగా మీరు మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని బాగా మసాజ్ చేయాలి. ఇది మంచి స్క్రబర్ లా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇక దీనిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకున్న తరువాత నీటితో శుభ్రంగా కడిగివేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తాజా బియ్యంపిండిని తీసుకుని దానిలో పచ్చిపాలను వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.ఇక ఆ తరువాత మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోని అది ఆరిన తరువాత నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు అన్ని ఈజీగా తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: