గంధం చెక్క ఉపయోగాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Divya
భారతదేశంలోని వివిధ మతాలలో, ముఖ్యంగా హిందూ సంస్కృతిలో గంధపు చెక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఈ గంధం చెక్క మంచి సువాసనను కలిగి ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుండి అంత్యక్రియల వరకు ఇది ఉపయోగించబడుతుంది. భారతదేశం యొక్క మతపరమైన, ఆయుర్వేద గ్రంథాలు దాని ఉపయోగాలు,లక్షణాల గురించి వర్ణించాయి. అయితే గంధం యొక్క ఇతర ఉపయోగాలు ఉన్నాయి. ఔషధాలే కాకుండా, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, ఫర్నిచర్, అలంకరణ వస్తువు లు కూడా దీంతో తయారు చేస్తారు. ఇతర దేశాలు కూడా చందనం పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నాయి.
అందమైన మరియు మృదువైన చర్మం కావాలని ప్రతివారు కోరుకుంటారు. అందుకే ఎంతో ఖర్చు పెట్టి మరీ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం. రసాయనాలతో తయారయ్యే క్రీమ్స్ చర్మానికి నిగారింపును తెచ్చేందుకు బదులు ఒక్కోసారి చెడు ప్రభావాన్ని చూపుతాయి.
మనకి ప్రకృతి నుండి సహజంగా లభించిన గంధం మరియు రోజ్ వాటర్ తో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు. రోజ్ వాటర్లో గంధం చెక్కను అరగదీసి దానిని ముఖానికి మాస్క్ లా వేసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
చర్మానికి సహజవంతమైన నిగారింపును తెచ్చే లక్షణాలు గంధం కలిగి ఉంది. ఇది చర్మాన్ని బ్యాక్టీరియా నుండి కాపాడి మొటిమలు మరియు నల్లటి మచ్చలను నివారిస్తుంది. గంధం చర్మాన్ని అనేక ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.
గంధం ఒత్తిడి మరియు శారీరక అలసటను దూరం చేస్తుంది. చర్మాన్ని ముడతలు పడే సమస్యను తగ్గించి యవ్వనమంతమైన చర్మాన్ని  ఇస్తుంది. చర్మం గరుకుగా ఉండే స్వభావాన్ని తగ్గించి మృధుత్వాన్ని ఇస్తుంది.
రోజ్ వాటర్ ను అన్ని సౌందర్యపు టిప్స్ లో వాడుతారు. ఇది చర్మానికి నిగారింపును తీసుకువస్తుంది. చర్మానికి కావాల్సిన తేమను అందించి డీహైడ్రేషన్ భారీ నుండి కాపాడుతుంది. చర్మానికి మంచి టోన్ ను తీసుకువస్తుంది. కాబట్టి ఈ గంధం చెక్క డిమాండ్ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: