కంటి సమస్యతో సతమతమవుతున్నారా.. ఇలా ఉపశమనం పొందండి..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు రోడ్డుపై ఉండే దుమ్ము, ధూళి వల్ల కంటి సమస్యలు కూడా మనల్ని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కంట్లో దుమ్ము పడినప్పుడు వచ్చే ఇబ్బంది చెప్పలేనిది.. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వాహనాలు ఫ్యాక్టరీల కారణంగా వెలువడే కాలుష్యం సమస్య మనిషి జీవన మడుగకి ఇబ్బంది కలిగిస్తోంది. ఇకపోతే ఇలాంటి కాలుష్యం ఎక్కువగా కంటి సమస్యలకు దారితీస్తోంది.
ముఖ్యంగా ప్రయాణం అయిపోయిన తర్వాత కంట్లో ఇసుక రేణువు ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  కాబట్టి కంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగే కళ్ళను కూడా తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. నిపుణులు సూచించే కంటిరక్షణ చర్యల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంట్లో  పడినప్పుడు వేరే కన్ను మూసి ఉంచితే..  నలుసు పడిన కంట్లో నుంచి నీరు రావడం మొదలవుతుంది.  ఫలితంగా ఆ దుమ్ము రేణువు బయటకు వచ్చే అవకాశం ఉంది.. చాలామంది కంట్లో నలుసు పడినప్పుడు రుద్దుతారు.. ఫలితంగా కన్ను ఎర్రబారిపోతుంది.
ఇలా కంట్లో ఏదైనా దుమ్ము , ధూళి రేణువులు పడ్డప్పుడు కళ్ళు నలపకుండా వెంటనే నీటితో శుభ్రం చేయాలి.  ఇలా చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న నలుసైనా సరే కంట్లో ఇరుక్కుపోతే తెల్లవారుజామున కళ్ళు తెరవడం మరింత ఇబ్బందిగా మారుతుంది. అలాంటప్పుడు ముఖాన్ని కళ్ళను శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. అలాగే కంట్లో ఏదైనా పడినప్పుడు చిన్నపాటి కంటే అరకులను వాడినట్లయితే వెంటనే లేదా లేని సమయంలో వైద్యుడు దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవడం మంచిది. అలాగే కంటి సమస్యల నుంచి నివారణ పొందడానికి కచ్చితంగా కళ్ళజోళ్ళు వాడాలి పొలాల్లో పనిచేసే రైతులైనా సరే కళ్ళల్లో ఏవేపడకుండా అద్దాలు ధరించడం వల్ల కంటిని కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: