కాకరకాయ తినడం లేదా.. అయితే ఈ రోగాలోస్తాయ్..!

Divya
కాకరకాయ సర్వరోగనివారిణి.ఇది మనకి ప్రకృతి ప్రసాధించిన గొప్ప వరం అని చెప్పవచ్చు. కానీ మనలో చాలా మంది కాకరకాయ అనగానే ముఖం చిట్లుంచుకుంటారు.తినడానికి కూడా ఇష్టపడరు. దీనికి కారణం అది చేదుగా ఉండటమే.అయితే ఈ చేదు వెనుక అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఇందులో విటమిన్ ఎ,సి, ఇ, కె లతోపాటు ఐరన్, జింక్,మెగ్నీసియం, ఫాస్ఫరస్, సోడియం,పోటాసియం, ఫైబర్ తో పాటు అనేక పోషక పదార్థాలు ఉన్నాయి.కాకరకాయ లో ఉండే ఫైబర్ మన జీర్ణశక్తికి సహాయపడుతుంది.జీవక్రియల ఫలితంగా ఏర్పడే పదార్థాలను బయటకి పంపడంతో పాటు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది.కడుపులో ఏర్పడే పరాన్న జీవులని తొలిగిస్తుంది.కాకరకాయ మన కిడ్నీలు మరియు మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచుకొనవచ్చు. కాకరకాయ రసాన్ని ప్రతి రోజు తీసుకోవడంవల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లను సైతం తగ్గించుకొనవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.లివర్ ను డ్యామేజీ భారీ నుండి కాపాడుతుంది.
ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది .శరీరంలో ఏర్పడే బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన రక్తాన్ని గుండెకు సరఫరా చేసే ధమనుల్లో ఏర్పడే అవరోధాలను నివారించి గుండెకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.అందువల్ల గుండె ఆరోగ్యంతో ఉంటుంది.షుగర్ వ్యాధితో బాధపడే వారికీ కాకరకాయ ఒక వరంగా చెప్పవచ్చు.కాకరకాయ లో ఇన్సులిన్ ని పోలీవుండే రాసాయనాలు రక్తంలోని షుగర్ లెవల్స్ ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు కాకరకాయ గనుక తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్తాలను బయటకి పంపి శరీరాన్ని అధిక బరువు నుండి కాపాడుతాయి.ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.అందువల్ల కాకరకాయ రసాన్ని కనుక మన డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితాలని పొందవచ్చు. మీరు కనుక కాకరకాయను తినకపోతే ఇలా ఎన్నో రోగాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: