వావ్.. ఏలకులతో ఎన్ని లాభాలో తెలుసా?

Purushottham Vinay
ఏలకులలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నల్ల ఏలకులు మంచి సుగంధ పరిమళాన్ని కలిగి ఉంటాయి. ఇంకా అంతే కాకుండా ఇది తలనొప్పిని కూడా చాలా ఈజీగా నయం చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, మానసిక కల్లోలం, మానసిక ఇంకా అలాగే భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప సాంప్రదాయ ఔషధంగా కూడా ఈ నల్ల ఏలకులను చెప్పవచ్చు.నలుపు ఏలకులు చర్మం, వెంట్రుకలు ఇంకా అలాగే శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఇక ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాన్ని ఇవి కలిగి ఉంటాయి. ఇంకా ఈ నల్ల ఏలకులను కొండ ఏలకులు అని కూడా అంటారు. నల్ల ఏలకుల నూనె కొన్ని ఆరోగ్య ఇంకా అలాగే సౌందర్య ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసు గుండె సమస్యలు, జీర్ణశయాంతర సమస్యలు  ఇంకా అలాగే శ్వాసకోశ వ్యాధులను ఇంకా ముఖ్యంగా ఆస్తమాను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.


ఊపిరితిత్తుల క్షయ, బ్రోన్కైటిస్, ఆస్తమా ఇంకా అలాగే కోరింత దగ్గుకు నల్ల ఏలకులు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఇది కడుపులో ఎసిడిటీని కూడా ఈజీగా తగ్గిస్తుంది. దీన్ని వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపు సమస్యలు చాలా ఈజీగా అదుపులోకి వస్తాయి. అలాగే అజీర్తి, అరుచి ఇంకా ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇంకా అలాగే నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.ఇంకా మీకు తల తిరుగుతున్నప్పుడు ఏలకులను నమిలి తింటే మంచి ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను కూడా ఈజీగా తొలగిస్తుంది. అలాగే కడుపు చికాకును తగ్గిస్తుంది. ఇంకా యాసిడ్ రిఫ్లక్స్కు కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఏలకులు తీసుకోండి. పైన తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: