సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సూప్స్ తాగండి?

Purushottham Vinay
కాలానికి తగినట్లుగా మనం మన ఆహారపు అలవాట్లను పాటించాలి. ఇక అలా చేయడం వల్ల మనం మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే కాక ఆరోగ్యాన్ని కూడా చాలా సులభంగా కాపాడుకోవచ్చు. చలికాలంలో మన రోగనిరోధక వ్యవస్థకు మంచి ప్రయోజనకరంగా పనిచేసే మూడు రకాల వంటకాల గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఈ చలికాలంలో ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం అల్లం క్యారెట్ సూప్ చాలా మంచి ఎంపిక. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్‌తో పాటు అల్లంలోని గుణాలు మనకు బాగా ఉపయోగపడతాయి. కంటి సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు కూడా క్యారెట్‌లోని పోషక గుణాలు  చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ ఇన్ఫెక్షన్‌ను దూరంగా ఉంచడంలో కూడా బాగా సహాయపడుతుంది.


అల్లం-క్యారెట్ సూప్‌లో యాంటీఆక్సిడెంట్లు ఇంకా అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు ఇంకా అలాగే గొంతు ఇన్ఫెక్షన్‌లను ఈజీగా నివారిస్తాయి.అలాగే మూంగ్ పప్పు, కొబ్బరి ఇంకా కివితో చేసిన సూప్ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివిలో విటమిన్ సీ అనేది చాలా పుష్కలంగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని కూడా బాగా బలపరుస్తుంది. మూంగ్ పప్పులో పుష్కలంగా ఉండే ప్రోటీన్ మనల్ని చాలా కాలం పాటు కూడా ఆకలి నుంచి సంతృప్తిగా ఉంచుతుంది. దీనికి లవంగాలు, ఎండుమిర్చి ఇంకా అలాగే పసుపు వంటి మసాలా దినుసులు జోడించడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మరింతగా పెరుగుతుంది.ఇంకా అలాగే మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్‌లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ సూప్‌లో మీకు నచ్చిన కూరగాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇంకా అలాగే కరివేపాకు వేసి సూప్ ని చేసుకోవచ్చు. ఈ సూప్ రుచికరమైనదిగా ఉండడమే కాక రోగనిరోధక శక్తిని కూడా బాగా బలపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: