ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా ఎక్కువగా మెదడు సంబంధిత సమస్యలతో బాగా సతమతం అవుతున్నారు.జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి అందరిలో కూడా తగ్గిపోతున్నాయి. చాలా మందికి కూడా మానసిక అనారోగ్యాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి.ఇక కొంతమంది పిల్లలకు అయితే అసలు పుట్టుకతోనే ఈ రకమైన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది పిల్లలు అయితే అసలు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల చదువుల్లో కూడా చాలా వెనుకబడుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఈ సమస్యలకు ఒక చక్కని పరిష్కారం ఉంది. ఇక అదేంటంటే.. అదే సరస్వతి ఆకు. ఈ ఆకును మెదడు సంబంధిత సమస్యలకు ఒక మంచి దివ్యౌషధంగా పరిగణిస్తారు.ఇక దీన్ని మీరు కొంతకాలం పాటు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి అనేది బాగా పెరుగుతుంది. ఈ సరస్వతి ఆకులను కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టాలి. ఇక ఆ తరువాత వాటిని 5 బాదంపప్పులు, 2 మిరియాలు, గోరు వెచ్చని నీరు పోసి మెత్తగా రుబ్బాలి.తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టి రసం తీయాలి.
దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో దానికి తేనె కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పరగడుపునే తీసుకోవాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా 40 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.ఇక ఈ మిశ్రమాన్ని మీరు రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. దీన్ని చిన్నారులకు సగం మోతాదులో ఇస్తే వారు ఖచ్చితంగా చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. మాటలు రాని పిల్లలకు ఈ మిశ్రమాన్ని ఇస్తే వారికి నెమ్మదిగా మాటలు వస్తాయి. ఇంకా అలాగే నత్తి కూడా తగ్గుతుంది. ఇలా సరస్వతి మొక్క ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ మొక్కలు మన చుట్టు పక్కల పరిసరాల్లోనే ఎక్కువగా ఉంటాయి. దీన్ని మన ఇంట్లో కూడా మనం పెంచుకోవచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు మనకు తాజా ఆకులు అనేవి లభిస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవచ్చు.