లైఫ్ స్టైల్: వాస్తు ప్రకారం కిచెన్లో ఈ వస్తువులు ఉండకూడదా..?

Divya
ఇంట్లో ఉండే అతి ముఖ్యమైన ప్రదేశాలలో వంటగది కూడా ఒకటని చెప్పవచ్చు. దీనిని అన్నపూర్ణ గదిగా పిలుస్తూ ఉంటారు. వంటగదికి ఆరోగ్యానికి మధ్య అవినాభావం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత శుభ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వంట గది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి కూడా అంతగా వస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మహిళలు వంటగదిని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటివారు కొన్ని విషయాలను తెలుసు కోవలసి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

వంటగదిలో చీపురులను అసలు ఉంచకూడదు. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ శుభ్రం చేసేటువంటి చీపురును వంట గదిలో ఉంచకూడదు. వంట గదిలో చీపురును ఉంచినట్లు అయితే ఆ ఇంట్లో తిండికి కొరత ఏర్పడుతుందట. ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.


వంట గదిలో మనం వేసుకొనే మందులను అసలు ఉంచుకోకూడదు. సాధారణంగా మాత్రలు వంటగదిలో ఉంచకూడదు ఎందుచేత అంటే ఇది కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.


వంటగదిలో మనం అద్దం ఉంచకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడైతే అద్దాన్ని ఉంచినట్లయితే వారి జీవితం కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.

వంట గదిలో ఏదైనా విరిగిన పాత్రలను, వస్తువులను సైతం ఉంచకూడదు.కొంతమంది మహిళలు విరిగిన పాత్రలను ఉంచుతారు. ఇవి వాస్తు ప్రకారం చాలా ఇబ్బందిని కలిగిస్తాయట. ముఖ్యంగా ఏవైనా తుప్పు పట్టిన వాటిని ఉంచకూడదట ఇవి రోగాల బారిన పడేలా చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

వాస్తు ప్రకారం వంటగదని వాస్తు నిపుణులతో ఆధారంగా ఏ మూల ఉంచాలో ఆ మూల ఉంచితే చాలా మంచిది. లేకపోతే పలు అనర్థాలకు దారితీస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: