లైఫ్ స్టైల్:వాసాకు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..!

Divya
 ఈ మధ్యకాలంలో అనేక రోగాలకు ఇంగ్లీష్ మందులు వాడి, అవి తగ్గకపోగా ఇతర దుష్ప్రరిణామాలు కలిగి వాటితో బాధపడుతూ ఉంటారు. కానీ మన ఆయుర్వేదంలో ఎలాంటి రోగాలు నైనా తొందరగా ఉపశమనం కలిగించే చిట్కాలు ఎన్నో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అలాంటి వాటిలో వాసాకు ఒకటి. దీన్ని అడ్డసరరా అని కూడా అంటారు. ఈ అడ్డసర ఆకులు వల్ల ఉపయోగాలు అంటే ఇప్పుడు చూద్దాం..

 రక్తహీనత తగ్గించడానికి..

 చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి వాసాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం  అడ్డసర ఆకులు 10 గ్రాములు, 10 గ్రాముల ధనియాలు,10 గ్రాముల కరక్కాయని తీసుకొని బాగా పొడిగా దంచుకొని, ఆ పొడిని ఒక లీటర్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటికి కండ చక్కెర కలిపి ఉదయాన్నే  తాగుతూ ఉంటే క్రమంగా రక్తహీనత తగ్గుతుంది.

 జాండీస్ తగ్గించడానికి..

 జాండీస్ తగ్గించడానికి వాసాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం వాసాకు ఆకుల రసం 10 మిల్లీ లీటర్లు, 30 మిల్లీలీటర్లమంచి తేనెను కలిపి రోజు మూడు పూటలా, తీసుకుంటూ ఉన్నట్లయితే ఏడు రోజుల్లో జాండీస్ తగ్గుముఖం పడుతుంది.

 ఉబ్బసం వ్యాధి తగ్గించడానికి..

 చలికాలం వస్తే చాలు ఉబ్బసం ఉన్నవాళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు ఈ వాసా కు కాండాన్ని తీసుకొని, బాగా ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని ఒక పేపర్లో చుట్టలుగా చుట్టి, సిగరెట్లు,బీడీలు తాగినట్టు పిలుస్తూ ఉండాలి. ఇలా రోజు చేస్తే ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది.

జుట్టు సంరక్షణకు..

 ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల జుట్టు బాగా పాడవుతూ ఉంటుంది. ఇలా పాడైన జుట్టుకు వాసాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వాసాకు ఆకులను తీసుకుని, దానికిరెండు స్పూన్ల నిమ్మరసం జోడించి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్లకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఒక అరగంట తర్వాత వేడి నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు బాగా మృదువుగా,దృఢంగా తయారవుతుంది. ఇది చుండ్రు నివారణకు కూడా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: