పనీర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వున్నాయి? అవేంటంటే?

Purushottham Vinay
ఇండియాలో ఏదైనా మంచి రుచికరమైన ఆహారం తినాలనుకున్నా.. పనీర్‌తో చేసిన అనేక వంటకాలు ఖచ్చితంగా మెనూలో ఉండాల్సిందే. ఈ పనీర్‌ను శాకాహారులు, మాంసాహారులు ఇద్దరూ ఇష్టంగా తింటారు. ఇందులో ప్రొటీన్లు మాత్రమే కాకుండా కాల్షియం, ఫాస్పరస్, సెలీనియం, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పనీర్ తీసుకోవడం వల్ల ఎముకలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. అయితే పనీర్ వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనప్పటికీ.. ఎక్కువ పనీర్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుందని మీకు తెలుసా.. ముఖ్యంగా ఈ పనీర్ ను కొంతమంది వ్యక్తులు ఎక్కువగా తీసుకోకూడాదు.పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు.. పనీర్ ను తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు, చెడిపోయిన లేదా బాగా నిల్వ ఉండే పనీర్ వల్ల .. చర్మ అలెర్జీలు ఏర్పడవచ్చు. కనుక పనీర్ కొనుగోలు చేసే ముందు తగిన శ్రద్ధ వహించండి.పనీర్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.కొన్ని రకాల ఆహారపదార్ధాలను తింటే పడని వారు కూడా పనీర్ తినకూడదు.



పనీర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల సమస్యను మరింత తీవ్రతరం అవుతుంది.చాలా మంది పచ్చి పనీర్ తినడానికి చాలా ఇష్టపడతారు. తరచుగా ఈ పాల విరుగుడుని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇలా ఎక్కువ మొత్తంలో పచ్చి పనీర్ ను తినడం వలన ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంది.ఎవరైనా జీర్ణక్రియ, మలబద్ధకం, అసిడిటీకి సంబంధించిన ఏదైనా సమస్య బాధపడుతుంటే.. అటువంటి వారు రాత్రి నిద్రపోతున్నప్పుడు పనీర్ తినకండి.ఎక్కువ పరిమాణంలో పనీర్ ను తినడం వల్ల.. అటువంటి వారికి ఎసిడిటీ తో పాటు కొన్నిసార్లు మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.మీరు రక్తపోటు ఉన్న రోగి అయితే మీరు పనీర్ తినకూడదు. కాటేజ్ చీజ్(పాల విరుగుడు) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని భావించినప్పటికీ.. దానిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.పనీర్ ప్రోటీన్ కి మంచి మూలం. ఈ ప్రొటీన్ శరీరంలో అధికంగా ఉంటే.. ఆ వ్యక్తికి డయేరియా సమస్య ఏర్పడవచ్చు. కనుక ఎంత ఇష్టమైన సరే ఒకేసారి ఎక్కువ పనీర్ తీసుకోవడం మానుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: