ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే చాలా మంది కూడా కూల్ డ్రింక్ లు అసలు తాగరు. వాటికి బదులగా పండ్ల రసాలు ఇంకా అలాగే హెల్తీ జ్యూస్ లు తాగుతూ ఉంటారు.అయితే కొన్ని రకాల జ్యూసులతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి.కొన్ని జ్యూస్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
తులసి జ్యూస్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు
తులసి నివారణగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ప్రతిరోజూ పండ్లు, కూరగాయల రసాలను తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వేయించిన ఆహార పదార్థాలు, ఎరేటెడ్ పానీయాలు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు.
తులసి ఆకులు రసం చేసి జ్యూస్‌లను రోజూ తాగితే ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది. ఆకుపచ్చని
తులసి కంటే
కృష్ణ తులసి ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి.
పుచ్చకాయ రసం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా పుచ్చకాయ రసం సహాయపడుతుంది.పుచ్చకాయ జ్యూస్ రోజూ తాగటంతో పాటు ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా వంటివి తీసుకోవడం తగ్గించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్ జ్యూస్ తాగితే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. ఈ జ్యూస్ తాగటం ద్వారా కాల్షియం,
విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం,
విటమిన్ బి,
విటమిన్ సి,
విటమిన్ డి,
విటమిన్ ఇ,
విటమిన్ కె శరీరానికి అందుతాయి. శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలను క్యారెట్ జ్యూస్ భర్తీ చేస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు ఇంకా చాలానే ఉన్నాయి. నాడీ వ్యవస్థ, చర్మం, జుట్టు, రక్తం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఏపడిన కణితిలను నయం చేయడంలో ఇంకా అలాగే ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన జ్యూస్ లు తాగండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.