లైఫ్ స్టైల్: పెరుగుతో దీనిని కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!!

Divya
ప్రతిరోజు పెరుగు తినడం వల్ల మన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక అందుకే ఆరోగ్యం మెరుగుపడాలి అంటే ప్రతిరోజు ఆహారం లో పెరుగు తప్పనిసరిగా చేర్చుకోవాలి. అప్పుడే శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇక పెరుగు ప్రోబయోటిక్ కు మంచి మూలం. ఇక ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించి ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది. ఇక అదే సమయంలో కాల్షియం, ప్రోటీన్ , మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా పెరుగులో పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మీరు ప్రతిరోజు పెరుగును రోటితో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఆహార నిపుణులు కూడా పేర్కొంటున్నారు.

ఇక ఆహారంలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. కాబట్టి పెరుగు,  రోటి కలిపి తింటే మాత్రం మంచి ఆరోగ్య లాభాలు కలుగుతాయి..

జీర్ణశక్తి మెరుగుపడుతుంది..
రోటితో పెరుగు కలిపి తింటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇక జీర్ణ శక్తికి కూడా బలంగా మారుతుంది. ఉదర సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. పెరుగు ఉత్తమ ప్రోబయోటిక్స్ కి మంచి మూలం అని చెప్పవచ్చు. ఇక దీంతోపాటు రోటీలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ ఆహారం తినడం వల్ల పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనితోపాటు మలబద్ధకం, గ్యాస్ , అజీర్తి, కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

రోగనిరోధక శక్తి..
పోషకాలు సమృద్ధిగా ఉండడం వల్ల పెరుగు, రోటి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇక ప్రతిరోజు పెరుగును రోటిలో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు వంటి వైరల్ లతో పోరాటానికి మీకు సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..ఎముకలు కూడా బలపడతాయి. ఇక పెరుగులో ఉండే కాల్షియం, ప్రోటీన్ కూడా ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: